వీళ్లంతా యువ రైతులు : మహర్షులతో మహర్షి

రైతుకి కావాలసింది సింపతీ కాదు, రెస్పెక్ట్ అంటూ మహర్షి ద్వారా వ్యవసాయం గొప్పతనాన్ని తెలియచెప్పిన దర్శకుడు వంశీని, మహేష్‌ని అందరూ అభినందించారు..

  • Publish Date - May 16, 2019 / 10:48 AM IST

రైతుకి కావాలసింది సింపతీ కాదు, రెస్పెక్ట్ అంటూ మహర్షి ద్వారా వ్యవసాయం గొప్పతనాన్ని తెలియచెప్పిన దర్శకుడు వంశీని, మహేష్‌ని అందరూ అభినందించారు..

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా మహర్షిలో చర్చించిన రైతు సమస్యలు, వీకెండ్ వ్యవసాయం వంటి వాటికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. మహర్షిని స్ఫూర్తిగా తీసుకుని, చాలామంది వ్యవసాయం పట్ల అవగాహన పెంచుకుని, పొలాలబాట పడుతున్నారు. వీకెండ్ వ్యవసాయం పేరుతో జాబ్ చేస్తున్నవాళ్ళు సైతం సేద్యానికి సై అంటున్నారు. రీసెంట్‌గా రియల్ లైఫ్ సీఈఓస్‌తో ఇంటరాక్ట్ అయిన మహేష్, ఇప్పుడు నిజ జీవిత మహర్షులతో సమావేశమయ్యాడు.

‘మహర్షులతో మహర్షి’ పేరిట ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి మహేష్ పాల్గొన్నాడు. ఆంధ్ర, తెలంగాణాలోని వివిధ ప్రాంతాలనుండి రైతులు హాజరయ్యారు. మహర్షి సినిమాలో చూపించినట్టు చాలామంది చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి, వ్యవసాయం చేస్తున్నారు. రైతుల సమస్యలు, వాటి పరిష్కారాలు తెలుసుకుంటూ, రైతుల ప్రయత్నాలను అభినందిస్తూ.. కార్యక్రమం అంతా వంశీ, మహేష్ అండ్ సుమ చాలా ఎమోషనల్‌గా కనిపించారు. రైతుకి కావాలసింది సింపతీ కాదు, రెస్పెక్ట్ అంటూ మహర్షి ద్వారా వ్యవసాయం గొప్పతనాన్ని తెలియచెప్పిన దర్శకుడు వంశీని, మహేష్‌ని అందరూ అభినందించారు.

వాచ్ వీడియో..