Mahavatar Narsimha: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మహావతార్ నరసింహా.. స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

మహావతార్ నరసింహా(Mahavatar Narsimha).. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ యానిమేషన్ చిత్రం జూలై 25న విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

Mahavatar Narasimha is being released on OTT.

Mahavatar Narsimha: మహావతార్ నరసింహా.. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ యానిమేషన్ చిత్రం జూలై 25న విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. కేవలం రూ.6 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన రెండురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.7 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ సాధించి సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. మ‌హా విష్ణువు ద‌శావ‌తారాల కాన్సెప్ట్ వస్తున్న ‘మ‌హావ‌తార్'(Mahavatar Narsimha) సినిమాటిక్ యూనివ‌ర్స్ లో భాగంగా వచ్చిన ఈ తొలి చిత్రం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

Vrusshabha: వృషభ టీజర్ వచ్చేసింది.. యోధుడిగా మోహన్ లాల్ వీరత్వం నెక్స్ట్ లెవల్

దర్శకుడు అశ్విన్‌ కుమార్‌ తెరకెక్కించిన ఈ సినిమాను కేజీఎఫ్, సాలార్, కాంతార లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన హోంబలే ఫిల్మ్స్‌ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్‌ దేశాయ్, చైతన్య దేశాయ్‌ సంయుక్తంగా నిర్మించారు. 200 పైగా థియేటర్స్‌ 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటివరకు ఏకంగా రూ.340 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, మహావతార్ నరసింహా సినిమా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. దీంతో, తాజాగా ఓటీటీ విడుదల గురించి అధికారిక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 19న శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. మరి థియేటర్ లో భారీ విజయాన్ని సాధించిన మహావతార్ నరసింహా సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.