Vrusshabha: వృషభ టీజర్ వచ్చేసింది.. యోధుడిగా మోహన్ లాల్ వీరత్వం నెక్స్ట్ లెవల్
మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా వస్తున్న భారీ చిత్రం ‘వృషభ’(Vrusshabha). హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు నంద కిషోర్ తెరకెక్కిస్తున్నాడు.

Mohanlal's Vrusshabha teaser released
Vrusshabha: మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా వస్తున్న భారీ చిత్రం ‘వృషభ’. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు నంద కిషోర్ తెరకెక్కిస్తున్నాడు. అనౌన్స్‌మెంట్ తోనే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నుంచి(Vrusshabha) తాజాగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. భారీ గ్రాఫిక్స్ తో, ఎక్స్ట్రార్డినరీ విజువల్స్ తో వచ్చిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం విజువల్స్ తో వండర్ క్రియేట్ చేసింది. ఇక యోధుడిగా మోహన్ లాల్ లుక్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా టాప్ నాచ్ ఉండటంతో సినిమాపై ఆసక్తిని పెంచింది.
TG Vishwa Prasad: మొత్తం రూ.140 కోట్ల నష్టం.. ఇంకా రికవరీ అవలేదు.. మిరాయ్ నిర్మాత షాకింగ్ కామెంట్స్
పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట. మోహన్ లాల్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇక కథ, కథనాల విషయంలో కూడా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. పీరియాడిక్ డ్రామా అంటే కేవలం యుద్ధ సన్నివేశాలు, గ్రాండియర్ మాత్రమే కాకుండా భావోద్వేగాలకు కూడా పెద్ద పీట వేశాడట. ఆ విషయంలో ఆడియన్స్ అంచనాలు ఏమాత్రం తగ్గవని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు. ఇక ఓవరాల్ గా వృషభ టీజర్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచిందని చెప్పాలి.