Mahesh Babu and Krishna Guest Appearance Planned in Nani Ashta Chamma Movie
Mahesh Babu – Nani : న్యాచురల్ స్టార్ నాని మొదటి సినిమా ‘అష్టాచమ్మా'(Ashta Chamma). ఈ సినిమాలో నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి రెడ్డి, భార్గవి నటించారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2008లో రిలీజయి మంచి విజయం సాధించింది. ఈ సినిమాతోనే నాని నటుడిగా ప్రయాణం మొదలుపెట్టాడు.
అష్టాచమ్మా సినిమాలో హీరోయిన్ స్వాతి మహేష్ బాబుకి వీరాభిమాని పాత్ర. మహేష్ బాబునే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కనీసం మహేష్ అని పేరు ఉన్న వాళ్ళని అయినా చేసుకోవాలి అనుకుంటుంది. సినిమాలో స్వాతి మహేష్.. మహేష్.. అంటూ కలవరించే సీన్స్ భలే ఉంటాయి.
అయితే ఈ సినిమాలో మహేష్ బాబు, కృష్ణలతో గెస్ట్ అప్పీరెన్స్ ప్లాన్ చేసుకున్నారని ఇంద్రగంటి మోహనకృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దానికి తగ్గట్టు స్క్రిప్ట్ కూడా రాసుకున్నారు. ఓ సీన్ లో.. స్వాతికి మహేష్ అంటే అభిమానం బాగా ఎక్కువైపోయి ఏకంగా మహేష్ ఇంటికి వెళ్లి మహేష్ బాబుని కలవాలని, పెళ్లి చేసుకోవాలని ఇంటి బయట హంగామా చేస్తుంది. అప్పుడు కృష్ణ గారు వచ్చి మహేష్ కి ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఇప్పుడు బయటకి వస్తే కష్టం అని చెప్తారట. కానీ ఎలాగోలా మహేష్ ని చూసి స్వాతి వెళ్ళిపోతుందని సీన్ రాసుకున్నారట.
Also Read : Pawan Kalyan : మెగాస్టార్‌కి పోటీగా పవర్ స్టార్ ? ‘హరిహర వీరమల్లు’ మూవీ రిలీజ్ అప్పుడే..
కృష్ణ, మహేష్ గారిని ఈ సినిమాలో నటింపచేయడానికి డైరెక్టర్ బాగానే ప్రయత్నించారు. కానీ ఒప్పుకోకపోవడంతో ఆ సీన్ తీసేశారట. ఒకవేళ మహేష్, కృష్ణ ఆ సీన్ ఒప్పుకొని ఉంటే అష్టాచమ్మా మరింత పెద్ద హిట్ అయ్యేదని భావిస్తున్నారు. అయితే అప్పట్లో మహేష్ కి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అని, అలాంటి లేడీ అభిమానుల్లో ఓ పాత్రని తీసుకొని స్వాతి క్యారెక్టర్ రాసుకున్నాను అని మోహనకృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.