Pawan Kalyan : మెగాస్టార్‌కి పోటీగా పవర్ స్టార్ ? ‘హరిహర వీరమల్లు’ మూవీ రిలీజ్ అప్పుడే..

తాజాగా హరిహర వీరమల్లు సినిమా నుంచి ఓ అప్డేట్ వినిపిస్తుంది.

Pawan Kalyan : మెగాస్టార్‌కి పోటీగా పవర్ స్టార్ ? ‘హరిహర వీరమల్లు’ మూవీ రిలీజ్ అప్పుడే..

Pawan Kalyan HariHara VeeraMallu Movie Update Ready to Release opposite to Chiranjeevi Movie

Chiranjeevi – Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత చాలా సినిమాలని ఓకే చేసి వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ మరో పక్క రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఇటీవల సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడు పవన్. పవన చేతిలో ప్రస్తుతం OG, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. ఉస్తాద్ ప్రస్తుతానికి పక్కన పెట్టేసారు. ఇక OG సినిమాకి ఇంకొక షెడ్యూల్ పవన్ డేట్స్ ఇస్తే షూట్ అయిపోతుంది. OG సినిమా ఈ సంవత్సరం సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ఇక క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో AM రత్నం నిర్మాణంలో హరిహర వీరమల్లు(HariHara VeeraMallu) సినిమా ఎప్పుడో మూడేళ్ళ క్రితం ప్రకటించారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నారు. మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో, పవన్ మొదటిసారి పీరియాడిక్ సినిమా చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ ఈ సినిమా నుంచి గ్లింప్స్, కొన్ని వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేయడంతో పవన్ అభిమానులు ఈ సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు.

Also Read : Shraddha Kapoor : శ్రద్ధా కపూర్ బాయ్ ఫ్రెండ్ ఇతనేనా? మొదటిసారి బాయ్ ఫ్రెండ్‌తో కనిపించిన శ్రద్ధా

కానీ పవన్ డేట్స్ ఇవ్వకపోవడంతో హరిహర వీరమల్లు షూట్ ఆగింది. అసలు ఈ సినిమా రిలీజ్ అవుద్దా, ఆపేశారా అని కూడా కొన్ని రోజుల క్రితం వరకు వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల చిత్రయూనిట్ ఈ సినిమా ఆగలేదు, షూటింగ్ అయినంతవరకు పోస్ట్ ప్రొడక్షన్, VFX వర్క్స్ జరుగుతున్నాయి, త్వరలోనే గ్లింప్స్ రిలీజ్ చేస్తాం అని ప్రకటించింది. తాజాగా హరిహర వీరమల్లు సినిమా నుంచి ఓ అప్డేట్ వినిపిస్తుంది. హరిహర వీరమల్లు సినిమా వచ్చే ఏడాది 2025 సంక్రాంతికి విడుదల చేస్తారని సమాచారం.

ఎన్నికల తర్వాత పవన్ డేట్స్ ఇస్తారని త్వరగా షూట్ పూర్తిచేసి, వచ్చే సంక్రాంతికే రిలీజ్ చేయాలని, ఈ లోపు ఎలాగో OG కూడా రిలీజ్ అయిపోతుందని టాలీవుడ్ టాక్. అయితే ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఎందుకంటే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి తన విశ్వంభర సినిమాని కూడా ప్రకటించారు. మరి అన్నయ్య మెగాస్టార్ పై పవర్ స్టార్ పోటీకి వస్తాడా అని చర్చగా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.

ఇక సంక్రాంతికి చిరంజీవి ‘విశ్వంభర’ సినిమానే కాకుండా, నాగార్జున సినిమా, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా, ప్రశాంత్ వర్మ సినిమా, ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమాలు కూడా బరిలోకి దిగనున్నాయి అని తెలుస్తుంది. మరి చివరి వరకు సంక్రాంతి బరిలో ఏ సినిమాలు ఉంటాయో చూడాలి.