Shraddha Kapoor : శ్రద్ధా కపూర్ బాయ్ ఫ్రెండ్ ఇతనేనా? మొదటిసారి బాయ్ ఫ్రెండ్‌తో కనిపించిన శ్రద్ధా
గత కొన్నాళ్లుగా శ్రద్ధా కపూర్ బాలీవుడ్ రచయిత రాహుల్ మోడీతో ప్రేమలో ఉందని, డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.

Shraddha Kapoor First Public Appearance with Rumoured Boy Friend Rahul Mody
Shraddha Kapoor : బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. శక్తి కపూర్ కూతురిగా బాలీవుడ్ లో తీన్ పత్తి సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆషీకీ 2 సినిమాతో పెద్ద హిట్ కొట్టింది. తెలుగులో ప్రభాస్ సరసన సాహో సినిమా చేసింది శ్రద్ధా కపూర్. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా అనంత్ – రాధికా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొంది.
అయితే గత కొన్నాళ్లుగా శ్రద్ధా కపూర్ బాలీవుడ్ రచయిత రాహుల్ మోడీతో ప్రేమలో ఉందని, డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ వీరు ఎప్పుడూ కలిసి బయట ఎక్కువగా కనపడలేదు. తాజాగా ఈ జంట అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకలకు కలిసి హాజరయ్యారు. గుజరాత్ జామ్ నగర్ లో జరిగిన అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకి శ్రద్ధా కపూర్, తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ మోడీతో కలిసి వచ్చింది.
Also Read : Salaar 2 : సలార్ పార్ట్ 2 షూటింగ్ అప్పట్నుంచే.. క్లారిటీ ఇచ్చిన నటుడు..
దీంతో ఈ జంట మీడియాకు చిక్కడంతో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. శ్రద్ధా కపూర్ బాయ్ ఫ్రెండ్ ఇతనే, ఇతనితోనే శ్రద్ధా డేటింగ్ చేస్తుంది అంటూ బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు నిజమేనా అంటే శ్రద్ధా కపూర్ లేదా రాహుల్ మోడీ దీనిపై స్పందించాలి.