Salaar 2 : సలార్ పార్ట్ 2 షూటింగ్ అప్పట్నుంచే.. క్లారిటీ ఇచ్చిన నటుడు..

సలార్ సినిమాకి పార్ట్ 2 కూడా ఉండటంతో ఆ సినిమా ఎప్పుడు వస్తుందా, ప్రభాస్ నుంచి మరింత యాక్షన్ ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.

Salaar 2 : సలార్ పార్ట్ 2 షూటింగ్ అప్పట్నుంచే.. క్లారిటీ ఇచ్చిన నటుడు..

Prabhas Prashanth Neel Salaar Movie Part 2 Shooting Update

Salaar 2 : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన సలార్ పార్ట్ 1 సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి వచ్చిన సలార్ సినిమా థియేటర్స్ లో హిట్ కొట్టి దాదాపు 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో కూడా చాలా రోజుల పాటు ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉండటంతో ఆ సినిమా ఎప్పుడు వస్తుందా, ప్రభాస్ నుంచి మరింత యాక్షన్ ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.

ప్రభాస్ ఇటీవలే కల్కి 2898AD మూవీ షూట్ పూర్తిచేసాడు. త్వరలో రాజాసాబ్ షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్స్ కూడా మొదలు కానుంది. ఆ తర్వాత సలార్ పార్ట్ 2 షూటింగ్ మొదలుపెట్టనున్నాడట ప్రభాస్. సందీప్ వంగ స్పిరిట్ సినిమా షూట్ నెక్స్ట్ ఇయర్ లో మొదలవుతుందని సందీప్ ప్రకటించాడు. ఈలోపు సలార్ 2 పూర్తిచేద్దామని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడట.

Also Read : Businessman : ‘బిజినెస్‌మెన్’ సినిమా ఆ హీరో చేయాల్సింది.. కానీ మహేష్ కథ వినకుండానే.. కథ కూడా పూరీది కాదు..

తాజాగా సలార్ సినిమాలో నటించిన బాబీ సింహ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సలార్ పార్ట్ 2 షూటింగ్ ఏప్రిల్ నుంచి ఉండొచ్చని, ఆ సినిమా షూట్ కోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపాడు. దీంతో ఏప్రిల్ లో సలార్ పార్ట్ 2 షూట్ మొదలవ్వనుందని టాలీవుడ్ సమాచారం. బాబీ సింహ సలార్ సినిమాలో శౌర్యంగుల్లో ఒకడైనా మన్నార్స్ లో కలిసిపోయి చివర్లో ట్విస్ట్ ఇస్తారు. క్లైమాక్స్ లో ప్రభాస్ కూడా శౌర్యంగుడే అనే ట్విస్ట్ ఇచ్చి వదిలేయడంతో పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి.