సితార పాపకి డాటర్స్ డే శుభాకాంక్షలు..

  • Published By: sekhar ,Published On : September 22, 2019 / 07:13 AM IST
సితార పాపకి డాటర్స్ డే శుభాకాంక్షలు..

Updated On : September 22, 2019 / 7:13 AM IST

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, నమ్రతల ముద్దుల కూతురు సితార వెండితెర ఎంట్రీ ఇవ్వ‌క‌పోయినా సోష‌ల్ మీడియాలో బాగా పాపులర్.. మ‌హేష్ లేదా న‌మ‌త్ర అప్పుడ‌ప్పుడు సితార డ్యాన్స్‌కి సంబంధించిన ప‌లు వీడియోల‌ని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుండడంతో సితార ఫ్యాన్స్‌, ఆడియన్స్‌కు బాగా పరిచయం.

సితార ఇటీవ‌ల దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురుతో కలిసి సొంతంగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి అందులో వెరైటీ వీడియోస్ పోస్ట్ చేస్తుంది. ఈ వీడియోల‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. డాట‌ర్స్ డే సంద‌ర్భంగా త‌న కూతురికి ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపాడు సూపర్ స్టార్..

Read Also : నిహారిక ‘మ్యాడ్ హౌస్’ ఇంట్రో వీడియో చూశారా!

వివిధ సందర్భాలలో మహేష్, సితార కలిసి తీసుకున్న ఫోటోలను ఓ వీడియోలా రూపొందించి.. ‘నా బుజ్జి సీతా పాపా నీకు డాటర్స్ డే  శుభాకాంక్షలు.. నువ్వు నా ప్రియ‌మైన కొంటె కూతురివి. నిన్ను ఎప్ప‌టికి ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు జీవితంలో అత్యంత ఎత్తుకి ఎద‌గాలని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ఆ వీడియో షేర్ చేశాడు.

నమ్రత.. ‘నా లైఫ్‌లో వెలుగులు పంచే వెలుగు దివ్వెవు నువ్వు, నా ఆకాశంలో ఎప్పుడూ మెరుస్తూ ఉండే నక్షత్రానివి నువ్వు.. నా ప్రపంచాన్ని ఎంతో అందంగా మార్చావు.. లవ్ యూ సితార’.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసింది.