శ్రీకృష్ణుడిగా సూపర్‌స్టార్!

Mahesh Babu as Lord Krishna: సూపర్‌స్టార్ మహేష్ బాబు శ్రీకృష్ణుడి గెటప్‌లో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సూపర్‌స్టార్ కృష్ణుడు పాత్రలో నటిస్తే చూడాలని ఉందనే కోరికను మహేష్ డైహార్డ్ ఫ్యాన్ ఈ ఫొటో ద్వారా వ్యక్తం చేశాడు.
శ్రీకృష్ణుడుగా మహేష్ ఎలా ఉంటాడనే విషయాన్ని ఫొటో ఎడిట్ రూపంలో ఎలివేట్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది. ‘యువరాజు’ సినిమాలో ఓ పాటలో మహేష్ కృష్ణుడిగా కనిపిస్తాడు. కొంటె కృష్ణుడిగా ఫ్లూట్ ఊదుతూ మహేష్ అలరించాడు ఆ పాటలో.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి, మహేష్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జక్కన్న కూడా ‘మహాభారతం’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చాలాసార్లు చెప్పారు. దీంతో అదే సినిమాగా తీస్తే మహేష్ కృష్ణుడిగా ఇలా ఉంటాడంటూ అభిమాని డిజైన్ చేసిన ఈ పిక్ అందర్నీ ఆకట్టుకుంటోంది.