Mahesh Babu: ఎట్టకేలకు మహేష్ బాబు బ్యాక్ టు వర్క్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట ఇటీవల తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మృతిచెందడంతో మహేష్ తీరని దు:ఖంలోకి వెళ్లిపోయాడు. అయితే ఆయన ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటకు వస్తున్నారు. తాజాగా మహేష్ బాబు తిరిగి షూటింగ్‌లో పాల్గొనడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Mahesh Babu: ఎట్టకేలకు మహేష్ బాబు బ్యాక్ టు వర్క్

Mahesh Babu Back To Work For Ad Shoot

Updated On : December 3, 2022 / 9:45 PM IST

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట ఇటీవల తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మృతిచెందడంతో మహేష్ తీరని దు:ఖంలోకి వెళ్లిపోయాడు. అయితే ఆయన ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటకు వస్తున్నారు. తాజాగా మహేష్ బాబు తిరిగి షూటింగ్‌లో పాల్గొనడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Mahesh Babu : అక్కలతో మహేష్ బాబు.. వైరల్ అవుతున్న ఫోటో..

అయితే మహేష్ పాల్గొన్నది సినిమా షూటింగ్‌లో కాదు.. ఓ యాడ్ షూటింగ్‌లో మహేష్ బాబు కెమెరా ముందుకు రావడంతో ఆయన తిరిగి షూటింగ్ చేయడం సంతోషంగా ఉందని అభిమానులు అంటున్నారు. ఇక ఈ యాడ్ షూట్ కోసం మహేష్ మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఆయన లుక్‌కు ఫిదా అవుతున్నారు. మౌంటేన్ డ్యూ కమర్షియల్ యాడ్‌లో మహేష్ పాల్గొనడంతో ఇలా పనిలో బిజీగా మారితే, బాధను త్వరగా మర్చిపోవచ్చని ఆయన సన్నిహితులతో పాటు అభిమానులు చెబుతున్నారు.

Mahesh Babu : నాన్న నాకు ఎన్నో ఇచ్చాడు.. అందులో గొప్పది మీ అభిమానం.. మహేష్ బాబు!

ఇక సినిమాల విషయానికి వస్తే, మహేష్ ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తొలి షెడ్యూల్‌ను ముగించుకుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్‌ను స్టార్ట్ చేసేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.