Sarkaru Vaari Paata: అటు షూటింగ్.. ఇటు ప్రమోషన్.. ఫ్యాన్స్‌కి మహేశ్ సూపర్ ట్రీట్

ఓవైపు షూటింగ్.. మరోవైపు ప్రమోషన్స్.. రెండు పనులు ఒకేసారి చేస్తూ సర్కారు వారి పాట సందడి చేస్తోంది. షూటింగ్ అయ్యాక తీరిగ్గా పబ్లిసిటీ చేసుకునే టైమ్ లేదు కాబట్టి గ్యాప్ ఇవ్వకుండా..

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: ఓవైపు షూటింగ్.. మరోవైపు ప్రమోషన్స్.. రెండు పనులు ఒకేసారి చేస్తూ సర్కారు వారి పాట సందడి చేస్తోంది. షూటింగ్ అయ్యాక తీరిగ్గా పబ్లిసిటీ చేసుకునే టైమ్ లేదు కాబట్టి గ్యాప్ ఇవ్వకుండా ఆడియెన్స్ ను ఎంగేజ్ చేస్తున్నారు సూపర్ స్టార్. ఇంకేముంది.. ఇదే.. ఈ రేంజ్ స్టఫ్పే కావాలని ఎదురుచూస్తున్న మహేశ్ ఫ్యాన్స్.. వచ్చిన అప్ డేట్స్ ను వచ్చినట్టు ట్రెండ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు.

Sarkaru Vaari Paata : ‘కళావతి’ పాటకి తమన్ స్టెప్పులు.. అదరగొట్టావంటూ మహేష్ అభిమానులు..

హై స్పీడ్ లో సర్కారు వారి పాటను పూర్తి చేస్తున్నాడు డైరెక్టర్ పరశురామ్. అతిత్వరలో మహేశ్ బాబు సైతం ఈ మూవీ సెట్స్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ధర్డ్ వేవ్ లో తనకి కరోనా వచ్చాక గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్.. తన పార్ట్ కంప్లీట్ చేసేందుకు బరిలోకి దిగుతున్నారు. మే 12న రిలీజ్ టార్గెట్ పెట్టారు కాబట్టి.. ఎక్కడా ఎవరూ తగ్గకుండా సర్కారు వారి పాట టీమ్ జోష్ చూపిస్తోంది.

Sarkaru Vaari Paata: ఇక ఆగడు.. ప్రమోషన్ల స్పీడ్ పెంచిన మహేశ్!

కళావతి సాంగ్ తో ఒక్కసారిగా ఫుల్ ట్రెండయింది సర్కారు వారి పాట. ఇక ఈ మ్యాజిక్ ని కంటిన్యూ చేయాలని మేకర్స్ డిసైడయ్యారు. ముఖ్యంగా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మరీ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు తమన్. కళావతి సాంగ్ ను సూపర్ గా కంపోజ్ చేయడమే కాదు.. రిలీజయ్యాక స్టెపులేసి మెప్పించాడు తమన్. ఇక త్వరలోనే మరో మాస్ సాంగ్ తో రాబోతున్నామని ట్వీట్ చేసి ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేశాడు. మార్చ్ 8న సర్కారు వారి పాట నుంచి మహేశ్ మాస్ లుక్స్ తో ఓ పాట వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

Sarkaru Vaari Paata-Salaar: హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్.. టాక్ అఫ్ ది ఇండస్ట్రీ!

సో సినిమాను పూర్తి చేసే పనిలో ఇంటెన్స్ చూపిస్తోన్న సర్కారు వారి పాట టీమ్ అదే రేంజ్ లో ప్రమోషన్స్ పై కాంన్సట్రేట్ చేసింది. ఫ్యాన్స్ ను నిరాశపరచకుండా కొత్త కంటెంట్ ను దించే పనిలో బిజీగా మారింది. అయితే ప్రస్తుతం హీరోయిన్ కీర్తి సురేశ్ పై మహేశ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ హైలైట్ గా మారింది. మహానటి తర్వాత ఒక్క హిట్ కూడా లేని కీర్తి.. మహేశ్ బాబుతో చేస్తున్న టైమ్ లో మళ్లీ గాంధారి లాంటి సాంగ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు కొందరు.