Mahesh Babu Foundation : ఏపీలో మొట్టమొదటి అమ్మ పాల బ్యాంక్ స్థాపించిన మహేష్ బాబు.. ఓపెనింగ్ లో మహేష్ భార్య సందడి..

మహేష్ బాబు ఫౌండేషన్ తరపున ఆంద్ర హాస్పిటల్స్ తో కల్సి అనేక హెల్త్ సంబంధిత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.

Mahesh Babu Foundation : ఏపీలో మొట్టమొదటి అమ్మ పాల బ్యాంక్ స్థాపించిన మహేష్ బాబు.. ఓపెనింగ్ లో మహేష్ భార్య సందడి..

Mahesh Babu Foundation Launched AP Firtst Mother’s Milk Bank by Namrata Shirodkar

Updated On : March 17, 2025 / 3:59 PM IST

Mahesh Babu Foundation : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలతో కూడా ప్రజలకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా అవసరం ఉన్న చిన్నపిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తూ ఎంతోమంది పిల్లలకు ప్రాణదాతగా నిలిచారు. అంతే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. మహేష్ బాబు ఫౌండేషన్ తరపున ఆంద్ర హాస్పిటల్స్ తో కల్సి అనేక హెల్త్ సంబంధిత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.

Mahesh Babu Foundation Launched AP Firtst Mother’s Milk Bank by Namrata Shirodkar

తాజాగా విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ లో ఏపీలోనే మొట్టమొదటి అమ్మ పాల బ్యాంక్ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా స్థాపించారు.

Mahesh Babu Foundation Launched AP Firtst Mother’s Milk Bank by Namrata Shirodkar

తల్లి పలు కారణాలతో పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఈ బ్యాంక్ తల్లి పాలని చిన్నారులకు అందిస్తుంది. ఈ కార్యక్రమాన్ని మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ స్థాపించారు.

Mahesh Babu Foundation Launched AP Firtst Mother’s Milk Bank by Namrata Shirodkar

అలాగే నమ్రత గుండె సమస్యలతో చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించి వారితో సమయం గడిపారు.

Mahesh Babu Foundation Launched AP Firtst Mother’s Milk Bank by Namrata Shirodkar
అలాగే మహిళల కోసం గర్భాశయ క్యాన్సర్ టీకా కార్యక్రమం ఉచితంగా ఇచ్చేలా ఆరంభించారు. ఇలా ఒకే రోజు పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది మహేష్ బాబు ఫౌండేషన్.

Mahesh Babu Foundation Launched AP Firtst Mother’s Milk Bank by Namrata Shirodkar

దీంతో మహేష్ ఫ్యాన్స్, నెటిజన్లు మహేష్ బాబుని, మహేష్ భార్య నమ్రతను అభినందిస్తున్నారు. మహేష్ భార్య ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Mahesh Babu Foundation Launched AP Firtst Mother’s Milk Bank by Namrata Shirodkar

ఈ కార్యక్రమం గురించి నమ్రత తన సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేసింది.

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)