Mahesh Babu Foundation : మహేష్ బాబు ఫౌండేషన్ మరో ముందడుగు.. మహేష్ ఫౌండేషన్ కోసం సితార విరాళం..

తాజాగా మహేష్ బాబు ఫౌండేషన్ మరో ముందడుగు వేసింది. https://www.maheshbabufoundation.org/ పేరుతో ఓ వెబ్ సైట్ ని స్థాపించారు. న్యూ ఇయర్ మొదటి రోజున సితార ఈ వెబ్ సైట్ ని అధికారికంగా లాంచ్ చేసింది. ఈ వెబ్ సైట్ లాంచ్ చేసిన అనంతరం సితార మాట్లాడుతూ...............

Mahesh Babu Foundation started a website and requesting donations

Mahesh Babu Foundation :  సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఎంతో మందికి ప్రాణాలు పోసి నిజమైన హీరో అనిపించుకున్నాడు. ఆంధ్ర హాస్పిటల్స్ భాగస్వామ్యంతో ఇప్పటికే 1000 మందికి పైగా పిల్లలకి ఫ్రీగా హార్ట్ ఆపరేషన్స్ చేయించి ఆ కుటుంబాలలో సంతోషాన్ని నింపాడు మహేష్. మహేష్ బాబు ఫౌండేషన్ స్థాపించి పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ మాత్రమే కాకుండా ఫ్రీ గా మెడికల్ క్యాంప్స్, తను దత్తత తీసుకున్న గ్రామాలని డెవలప్ చేయడం లాంటివి చేస్తున్నారు.

తాజాగా మహేష్ బాబు ఫౌండేషన్ మరో ముందడుగు వేసింది. https://www.maheshbabufoundation.org/ పేరుతో ఓ వెబ్ సైట్ ని స్థాపించారు. న్యూ ఇయర్ మొదటి రోజున సితార ఈ వెబ్ సైట్ ని అధికారికంగా లాంచ్ చేసింది. ఈ వెబ్ సైట్ లాంచ్ చేసిన అనంతరం సితార మాట్లాడుతూ.. నాన్న చేసే మంచి పనుల్లో ఎప్పుడూ నేను భాగం అవ్వాలనుకున్నాను. ఇప్పుడు ఇలా సైట్ లాంచ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నెల నా పాకెట్ మనీ మొత్తాన్ని ఈ ఫౌండేషన్ కి ఇస్తున్నాను. మీరు కూడా డొనేట్ చేయాలనుకుంటే ఈ సైట్ లోకి వెళ్లి డొనేట్ చేయొచ్చు అని తెలిపింది.

Waltair Veerayya : ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ’ అంటూ మరో పాట లీక్ చేసిన చిరు..

మహేష్ బాబు ఫౌండేషన్ వెబ్ సైట్ ద్వారా డొనేట్ చేయాలనుకునేవాళ్ళు ఎవరైనా డొనేట్ చేయొచ్చు. అంతే కాక ఎవరికైనా పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ ఉంటే ఈ సైట్ ద్వారా రిక్వెస్ట్ కూడా పెట్టొచ్చు. దీంతో మహేష్ మరో ముందడుగు వేసి మరింతమందిని ఈ మంచిపనిలో భాగం చేస్తున్నారు.