Waltair Veerayya : ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ’ అంటూ మరో పాట లీక్ చేసిన చిరు..

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజతో కలిసి మాస్ జాతర చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఇప్పటికే విడుదలైన ‘బాస్ పార్టీ’, ‘చిరంజీవి-శ్రీదేవి’, ‘వీరయ్య’, 'పూనకాలు లోడింగ్' పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలోనే మరో డ్యూయెట్ సాంగ్ ని చిరంజీవి లీక్ చేశాడు.

Waltair Veerayya : ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ’ అంటూ మరో పాట లీక్ చేసిన చిరు..

chiranjeevi leak another song from Waltair Veerayya

Updated On : January 1, 2023 / 7:24 PM IST

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజతో కలిసి మాస్ జాతర చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. చిరు వింటేజ్ లుక్ లో దర్శనమిస్తున్న ఈ సినిమాలో రవితేజ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. కె బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Chiranjeevi : పవన్‌ని విమర్శించి.. నన్ను ఫంక్షన్స్‌కి పిలుస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది.. చిరంజీవి!

సినిమా రిలీజ్ దగ్గర పడడంతో మూవీలోని ఒకొక పాటని విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ‘బాస్ పార్టీ’, ‘చిరంజీవి-శ్రీదేవి’, ‘వీరయ్య’, ‘పూనకాలు లోడింగ్’ పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలోనే మరో డ్యూయెట్ సాంగ్ ని చిరంజీవి లీక్ చేశాడు. న్యూ ఇయర్ కానుకగా 5వ సాంగ్ కి సంబంధించిన బిటిఎస్ వీడియోని రిలీజ్ చేస్తూ, సాంగ్ లిరిక్స్ ని లీక్ చేశాడు.

‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ’ అంటూ సాగే ఈ సాంగ్ కూడా ఫ్రాన్స్ లోనే షూటింగ్ జరుపుకుంది. ఈ సాంగ్ షూట్ తో వాల్తేరు వీరయ్య షూట్ కి గుమ్మడికాయ కొట్టినట్లు వెల్లడించాడు చిరు. త్వరలోనే ఈ పాట మరియు ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ఇందుకు సంబంధించిన వీడియో అండ్ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.