Chiranjeevi : పవన్‌ని విమర్శించి.. నన్ను ఫంక్షన్స్‌కి పిలుస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది.. చిరంజీవి!

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మూవీ టీం. ఈ క్రమంలోనే చిరంజీవి ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వగా.. ఆ ఇంటర్వ్యూలో పవన్ పై తన ప్రేమని వ్యక్తం చేశాడు.

Chiranjeevi : పవన్‌ని విమర్శించి.. నన్ను ఫంక్షన్స్‌కి పిలుస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది.. చిరంజీవి!

Chiranjeevi emotional comments on pawn kalyan

Chiranjeevi : మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కె బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్యపాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికే ఒకటొకటిగా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Chiranjeevi : దేవుడు నేను కోరుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడు.. మళ్ళీ ఈ పెద్దరికరం వద్దు.. చిరంజీవి!

సంక్రాంతి విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మూవీ టీం. ఈ క్రమంలోనే చిరంజీవి ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వగా.. ఆ ఇంటర్వ్యూలో పవన్ పై తన ప్రేమని వ్యక్తం చేశాడు. ‘పవన్ కళ్యాణ్‌పై అనేక విమర్శలు వస్తున్నాయి. వాటిని విన్నపుడు మీకు ఎలా అనిపిస్తుంది’ అంటూ ప్రశ్నించగా.. చిరంజీవి చాలా బాధగా ఉంటుంది అంటూ బదులిచ్చాడు.

“వాడిని నా చేతులు మీదగా ఎత్తుకొని పెంచాను. నేను, నా భార్య సురేఖ వాడికి తల్లిదండ్రులు లాంటి వాళ్ళం. పవన్ కి కూడా మా మీద అంతే ప్రేమ ఉంటుంది. వాడికి డబ్బు ఆశ లేదు, పదవి కాంక్ష లేదు, నిజం చెప్పాలి అంటే మొన్నటి వరకు వాడికి సొంత ఇల్లు కూడా లేదు. ఏ మాత్రం స్వార్ధం లేని వ్యక్తి పవన్. ప్రజలకి ఏదో మంచి చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చాడు. మంచి చేద్దామనే వ్యక్తిని ప్రోత్సహిండం మానేసి, మితిమీరిన విమర్శలు చేస్తుంటే బాధ అనిపిస్తుంది.

అయితే పవన్ అంతలా విమర్శించిన వాళ్ళు, మళ్ళీ నా దగ్గరకి వచ్చి ఫంక్షన్స్ కి రమ్మని పిలుస్తుంటారు. నా తముడిని అన్ని మాటలు అన్నవాళ్ళతో నేను మాట్లాడాల్సి వస్తున్నా, కలవాల్సి వస్తున్నా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది” అంటూ బాధ పడ్డాడు.