అనంత్‌ అంబానీ వెడ్డింగ్‌కు టాలీవుడ్ ప్రిన్స్.. మహేశ్ బాబు న్యూలుక్స్ వైరల్

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు న్యూస్టైల్ చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరోను తెరపై రాజమౌళి ఎలా చూపిస్తారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అనంత్‌ అంబానీ వెడ్డింగ్‌కు టాలీవుడ్ ప్రిన్స్.. మహేశ్ బాబు న్యూలుక్స్ వైరల్

Updated On : July 12, 2024 / 1:08 PM IST

Mahesh Babu Latest Look: భారత అపర కుబేరుడు ముఖశ్ అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ వివాహం రాధిక మర్చెంట్ తో అంగరంగ వైభవంగా జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్లో ఈరోజు అట్టహాసంగా పెళ్లి జరగబోతోంది. అనంత్‌ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహానికి దేశ, విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలను ఆహ్వానించారు. దీంతో జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్ కు సెలబ్రిటీలు క్యూ కట్టారు.

టాలీవుడ్ నుంచి మహేశ్ బాబు, తన భార్య నమ్రతా శిరోద్కర్ శుక్రవారం ముంబై చేరుకున్నారు. మహేశ్ న్యూస్టైల్ చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో నటించనున్నారు. ఈ మూవీ కోసం లేటెస్ట్ మేకోవర్ చేస్తున్నారు టాలీవుడ్ ప్రిన్స్. ఇందుకోసం హెయిర్ తో పాటు గడ్డం బాగా పెంచారు. తన లుక్ రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు ప్రిన్స్ మహేశ్. తమ అభిమాన హీరోను రాజమౌళి తెరపై ఎలా చూపిస్తారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా, మహేశ్ బాబు ముంబై చేరుకున్న వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని మహేశ్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ అదిరిపోయిందని కామెంట్లు పెడుతున్నారు.

Also Read : రాంచరణ్ కొత్త కారు చూశారా.. ఎన్ని కోట్లో తెలుసా? హైదరాబాద్‌లో ఈ కార్ ఫస్ట్ చరణ్‌కే..

మెగా పవర్ స్టార్ రాంచరణ్, తన భార్య ఉపాసనతో కలిసి నిన్ననే ముంబైకి బయలు దేరారు. టాలీవుడ్ నుంచి మహేశ్, రాంచరణ్‌కు మాత్రమే అంబానీ ఫ్యామిలీ నుంచి ఇన్విటేషన్ వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ను ఆహ్వానించినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుంచి ఇంకెవరు ప్రముఖులు అనంత్‌ అంబానీ విహానికి వెళతారో చూడాలి.