Ram Charan : రామ్ చరణ్ కొత్త కారు చూశారా? ఎన్ని కోట్లో తెలుసా? హైదరాబాద్‌లో ఈ కార్ ఫస్ట్ చరణ్‌కే..

రామ్ చరణ్ దగ్గర ఇప్పటికే చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. తాజాగా చరణ్ ఖాతాలో మరో ఖరీదైన కారు చేరింది.

Ram Charan : రామ్ చరణ్ కొత్త కారు చూశారా? ఎన్ని కోట్లో తెలుసా? హైదరాబాద్‌లో ఈ కార్ ఫస్ట్ చరణ్‌కే..

Ram Charan is the First person Having Rolls Royce latest Version Spectre Car Videos goes Viral

Updated On : July 11, 2024 / 1:30 PM IST

Ram Charan : రామ్ చరణ్ RRR తర్వాత పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతున్నాడు. ఇటీవలే చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేసాడు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలు కూడా లైన్లో పెట్టాడు. ప్రస్తుతం చరణ్ కి నార్త్ లో కూడా బాగా ఫాలోయింగ్ పెరిగింది.

అయితే రామ్ చరణ్ దగ్గర ఇప్పటికే చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. తాజాగా చరణ్ ఖాతాలో మరో ఖరీదైన కారు చేరింది. రోల్స్ రాయిస్ కార్లు చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. చిరంజీవికి వైట్ కలర్ రోల్స్ రాయిస్ కారు ఉంది. అయితే తాజాగా రామ్ చరణ్ కూడా రోల్స్ రాయిస్ కార్ కొన్నాడు. రోల్స్ రాయల్ లేటెస్ట్ వర్షన్ స్పెక్ట్రా కారును చరణ్ కొన్నాడు. ఈ కారు ధర ఏకంగా 7.5 కోట్లు అని సమాచారం.

Also Read : Manchu Vishnu : వాట్.. స్టార్ హీరోల కంటే మంచు విష్ణుకే పాపులారిటీ ఎక్కువా? ఆ విషయంలో స్టార్ హీరోలని దాటేసిన విష్ణు..

తాజాగా చరణ్, ఉపాసన ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు వెళ్ళడానికి ఎయిర్ పోర్ట్ లో ఈ రోల్స్ రాయిస్ కారులోనే వెళ్లడంతో వీడియోలు వైరల్ గా మారాయి. రోల్స్ రాయిస్ కారుని చరణ్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి స్టైలిష్ గా దిగాడు. ఉపాసన కూడా ఈ కార్ లో క్లిన్ కారాతో దిగింది. దీంతో చరణ్ కొత్త కారు వైరల్ గా మారింది. ఈ కారుని జనవరిలో రిలీజ్ చేశారు. చరణ్ గతంలో ఎప్పుడో బుక్ చేసినా ఇటీవలే ఈ కార్ డెలివరీ అయింది. హైదరాబాద్ లో ఈ కార్ ఫస్ట్ కస్టమర్ రామ్ చరణ్ కావడం గమనార్హం.