Manchu Vishnu : వాట్.. స్టార్ హీరోల కంటే మంచు విష్ణుకే పాపులారిటీ ఎక్కువా? ఆ విషయంలో స్టార్ హీరోలని దాటేసిన విష్ణు..

ఈ విషయంలో మంచు విష్ణు చాలా మంది స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోవర్స్ తో ఉన్నాడు.

Manchu Vishnu : వాట్.. స్టార్ హీరోల కంటే మంచు విష్ణుకే పాపులారిటీ ఎక్కువా? ఆ విషయంలో స్టార్ హీరోలని దాటేసిన విష్ణు..

Manchu Vishnu Having More Followers in Instagram rather than star Heros

Updated On : July 11, 2024 / 1:06 PM IST

Manchu Vishnu : సాధారణంగానే సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు. అభిమానులతో పాటు మాములు నెటిజన్లు కూడా సెలబ్రిటీలను ఫాలో అవుతారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ తో కూడా పాపులారిటీని లెక్కేసుకుంటారు కొంతమంది. అయితే తాజాగా మంచు విష్ణు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కౌంట్ వైరల్ గా మారింది. మంచు విష్ణుని ఇన్‌స్టాగ్రామ్ లో ఏకంగా 8 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. అంటే ఆల్మోస్ట్ 80 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

అయితే ఈ విషయంలో మంచు విష్ణు చాలా మంది స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోవర్స్ తో ఉన్నాడు. ఎన్టీఆర్ కి ఇన్‌స్టాగ్రామ్ లో 7.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. చిరంజీవికి 3.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు 3.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. రాజమౌళికి 3.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. స్టార్ డమ్, మార్కెట్ తో పోల్చుకుంటే వీళ్లంతా మంచు విష్ణు కంటే చాలా ఎక్కువే. కానీ మంచు విష్ణుకి ఎక్కువ ఫాలోవర్స్ ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది.

Also Read : Raj Tharun Movie : రాజ్ తరుణ్ – లావణ్య కేసు.. దెబ్బకి సినిమా వాయిదా వేసుకున్న హీరో, హీరోయిన్..

సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. దీంతో కొంతమంది మంచు విష్ణు ఫాలోవర్స్ పెంచుకోడానికి డబ్బులు ఖర్చుపెట్టాడా? లేక ఎక్కువ యాక్టివ్ గా ఉంటాడని ఫాలోవర్స్ వచ్చారా? లేక మంచు ఫ్యామిలీని ట్రోల్ చేస్తుంటారు కాబట్టి ట్రోల్ కంటెంట్ కోసం ఫాలో అవుతున్నారా అని సందేహాలు వస్తున్నాయి. కానీ ఇటీవల రీల్స్ చేసే వాళ్లకి కూడా మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఫాలోవర్స్ కి స్టార్ డమ్ కి సంబంధమే లేదు అని మిగతా హీరోల అభిమానులు అంటుంటే మంచు అభిమానులు మాత్రం మా హీరోకి ఫాలోవర్స్ ఎక్కువ అని పోస్టులు చేస్తున్నారు.

Manchu Vishnu Having More Followers in Instagram rather than star Heros