Mahesh Babu
Mahesh Babu : ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న రమేష్ బాబు మరణించిన సంగతి తెలిసిందే. ఆరోగ్య సమస్యలతో ఆయన మరణించారు. అయితే ఆయన మరణించినప్పుడు మహేష్ కరోనా సోకి ఐసోలేషన్ లో ఉన్నాడు. దీంతో తన అన్నని చివరి చూపు చూసుకోలేకపోయాడు. తన అన్న చివరి చూపు దక్కలేదని మహేష్ చాలా బాధపడ్డారని సన్నిహితుల సమాచారం. ఇక ఇటీవల కరోనా తగ్గడంతో మహేష్ మొదటిసారి బయటకి వచ్చాడు.
Supritha : ఇది మ్యాటర్.. ప్రేమపై క్లారిటీ ఇచ్చిన సురేఖ కూతురు..
రమేష్ బాబు పెద్ద కర్మ కార్యక్రమంలో మహేష్ పాల్గొన్నారు. కరోనా తగ్గక మొదటి సారి బయటకి వచ్చి తన అన్న కార్యక్రమంలోనే పాల్గొన్నారు మహేష్. అన్నయ్య రమేష్ బాబుకి నివాళులు అర్పించారు. అన్న రమేష్ బాబుకి నివాళులు అర్పించిన ఫోటోలు బయటకి రావడంతో ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.