Mahesh Babu : మహేష్ బాబు దెబ్బకి ఒక్కసారిగా భారీగా పెరిగిన సేల్స్.. ఇది కదా మహేష్ రేంజ్ అంటే..

మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.(Mahesh Babu)

Mahesh Babu

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతో మహేష్ ఏకంగా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ టార్గెట్ పెట్టుకున్నాడు. మహేష్ ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా ఈ మహేష్ – రాజమౌళి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.(Mahesh Babu)

మహేష్ బాబు ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రెగ్యులర్ గా యాడ్స్ చేస్తారని తెలిసిందే. మహేష్ చాలా యాడ్స్ చేశారు. అందులో అభి బస్ ఒకటి. అభి బస్ కి మహేష్ బాబు ఇప్పటికి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. దీని కోసమే పలు యాడ్స్ చేశారు మహేష్. అభి బస్ ఒక ఆన్లైన్ బస్ టికెట్ బుకింగ్ యాప్.

Also Read : Tollywood Heroine : సినిమా పెద్ద హిట్.. ఏకంగా ఇన్‌స్టాగ్రామ్ లో తన పేరు మార్చేసుకున్న హీరోయిన్..

తాజాగా అభి బస్ అధినేత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో మహేష్ గురించి ఆసక్తికర విషయం తెలిపారు. అభి బస్ అధినేత సుధాకర్ మాట్లాడుతూ.. మహేష్ బాబు మా బ్రాండ్ అంబాసిడర్ అవ్వకముందు మేము కేవలం 3000 టికెట్లు అమ్మేవాళ్ళం రోజుకు. ఆయన మాతో జాయిన్ అయ్యాక, మహేష్ బాబు గారు అభి బాస్ అంబాసిడర్ అయ్యాక రోజుకు 20 వేలకు పైగా టికెట్స్ అమ్మడం మొదలుపెట్టాము. ఆయన మా బ్రాండ్ కు చాలా ప్లస్ అయ్యారు అని తెలిపారు.

అందుకేనేమో మహేష్ ఎప్పుడో అభి బస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా జాయిన్ అయ్యారు. కొన్నేళ్ల తర్వాత కూడా ఇప్పటికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.

Also See : Kishkindhapuri : బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ.. ‘కిష్కింధపురి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..