Mahesh Babu : మళ్ళీ వెకేషన్‌కి చెక్కేస్తున్న మహేష్.. వైరల్ అవుతున్న మహేష్ లుక్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు సమయం దొరికితే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళుతుంటాడు. తాజాగా మరోసారి వెకేషన్ కి చెక్కేస్తున్నాడు. SSMB28 షూటింగ్ కొంత విరామం ఇచ్చి మహేష్ తన భార్య నమ్రతాతో కలిసి వెకేషన్ కి వెళుతున్నాడు.

Mahesh Babu : మళ్ళీ వెకేషన్‌కి చెక్కేస్తున్న మహేష్.. వైరల్ అవుతున్న మహేష్ లుక్స్!

Mahesh Babu

Updated On : February 9, 2023 / 3:18 PM IST

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సమయం దొరికితే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళుతుంటాడు. తాజాగా మరోసారి వెకేషన్ కి చెక్కేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చాలా రోజులు గ్యాప్ తరువాత ఇటీవలే మొదలైంది. హైదరాబాద్ సారధి స్టూడియోలోని ప్రత్యేక సెట్ లో కీలకమైన షెడ్యూల్ జరుపుకుంటుంది. కాగా షూటింగ్ కొంత విరామం ఇచ్చి మహేష్ తన భార్య నమ్రతాతో కలిసి వెకేషన్ కి వెళుతున్నాడు.

SSMB28 : SSMB28 మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాత నాగవంశీ..

ఫిబ్రవరి 10 మహేష్, నమ్రతా మ్యారేజ్ డే కావడంతో.. ఇద్దరు కలిసి పెళ్లిరోజును ఎంజాయ్ చేయడానికి వెకేషన్ పయనమయ్యారు. అయితే ఎక్కడికి వెళుతున్నారు అనేది మాత్రం తెలియదు. ఈరోజు (ఫిబ్రవరి 9) ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లోని మహేష్, నమ్రతా ఉన్న వీడియో, ఫోటోలను కొంతమంది నెటిజెన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో మహేష్ బాబు లుక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. బ్లూ కాప్, గ్లాస్సెస్, షర్ట్ పై షర్ట్ వేసి అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. దీంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక మూవీ విషయానికి వస్తే.. త్రివిక్రమ్, మహేష్ కలయికలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ఆడియన్స్ ని బాగా అలరించాయి. ప్రస్తుతం వీరిద్దరూ కూడా హిట్ ట్రాక్ లో ఉన్నారు. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడిగా శ్రీలీల, పూజా హెగ్డే నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకొని, ఈ ఏడాది ఆగష్టు 11న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.