వంశీకి మహేష్ ముద్దు : సోషల్ మీడియాలో వైరల్
సక్సెస్ మీట్ అనంతరం మూవీ టీమ్‌తో కలిసి లంచ్ చేసాడు మహేష్. ఈ సందర్భంగా మహేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి బుగ్గపై ముద్దు పెట్టాడు..

సక్సెస్ మీట్ అనంతరం మూవీ టీమ్‌తో కలిసి లంచ్ చేసాడు మహేష్. ఈ సందర్భంగా మహేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి బుగ్గపై ముద్దు పెట్టాడు..
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, అశ్వినీదత్, దిల్ రాజు, పివిపి కలిసి నిర్మించిన మహర్షి, మే 9న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్లు సాధిస్తుందీ సినిమా. ఫ్రెండ్ షిప్, రైతుల సమస్యలు వంటి అంశాలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో మహేష్ బాబు కాలర్ ఎగరెయ్యడం సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా మహేష్, వంశీ పైడిపల్లి ఫ్యామిలీ మెంబర్స్ కలిసి మహర్షి సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు.
సక్సెస్ మీట్ అనంతరం మూవీ టీమ్‌తో కలిసి లంచ్ చేసాడు మహేష్. ఈ సందర్భంగా మహేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి బుగ్గపై ముద్దు పెట్టాడు. ‘ఇది నా బెస్ట్ మూమెంట్, ఇంతకంటే ఇంకేం అడగగలను.. థ్యాంక్యూ వంశీ’ అంటూ.. వంశీ తీసిన ఈ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు మహేష్. ఇప్పటికే మహర్షి స్ఫూర్తితో ‘వీకెండ్ వ్యవసాయం’ అనే కాన్సెప్ట్‌తో పలువురు పొలాలవైపు అడుగులు వేస్తున్నారు. 25వ సినిమా మహర్షి మహేష్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోనుంది.