రియల్ సీఈఓలతో రిషి

గచ్చిబౌలిలోని ఏఏంబీ సినిమాస్‌లో మహేష్, నమ్రత, డైరెక్టర్ వంశీ పైడిపల్లి రియల్ లైఫ్ సీఈఓస్‌తో ఇంటరాక్ట్ అయ్యారు..

  • Published By: sekhar ,Published On : May 14, 2019 / 10:08 AM IST
రియల్ సీఈఓలతో రిషి

Updated On : May 14, 2019 / 10:08 AM IST

గచ్చిబౌలిలోని ఏఏంబీ సినిమాస్‌లో మహేష్, నమ్రత, డైరెక్టర్ వంశీ పైడిపల్లి రియల్ లైఫ్ సీఈఓస్‌తో ఇంటరాక్ట్ అయ్యారు..

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, వైజయంతీ మూవీస్.. అశ్వినీదత్, శ్రీ వెకటేశ్వర క్రియేషన్స్.. దిల్ రాజు, పివిపి సినిమా.. పెరల్ వి.పొట్లూరి – పరమ్ వి.పొట్లూరి కలిసి నిర్మించిన మహర్షి, మే 9న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. మహేష్ 25వ సినిమా కావడంతో మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో ఎంటరైంది మహర్షి. కార్పొరేట్ కంపెనీ సీఈవో, కాలేజ్ స్టూడెంట్, రైతుగా.. మహేష్ డిఫరెంట్ వేరియేషన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో చర్చించిన రైతు సమస్యలు, వీకెండ్ వ్యవసాయం వంటి వాటికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.

ఇదిలా ఉంటే మహేష్ రీసెంట్‌గా రియల్ లైఫ్ సీఈఓస్‌తో ఇంటరాక్ట్ అయ్యాడు. గచ్చిబౌలిలోని ఏఏంబీ సినిమాస్‌లో మహేష్, నమ్రత, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఈఓలు అడిగిన పలు ప్రశ్నలకు వంశీ, మహేష్ సమాధానాలిచ్చారు. ఈ ప్రోగ్రాం ఆద్యంతం వినోద భరితంగా సాగింది.

వాచ్ వీడియో..