Mahesh Babu
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. శరవేగంగా సాగిన షూటింగ్ బాహుబలి రీ రిలీజ్ తో బ్రేక్ పడింది. త్వరలోనే మళ్ళీ ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. పాన్ వరల్డ్ లెవల్లో ఈసారి రాజమౌళి హంగామా చేయనున్నారు.(Mahesh Babu)
అయితే SSMB29 తర్వాత మహేష్ ఏ సినిమా చేస్తాడనే సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ విషయంపై టాలీవుడ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. యానిమల్ లాంటి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. స్పిరిట్ అయిన వెంటనే మహేష్‌తో ఓ సినిమా చేసేందుకు ప్రిపేర్ అవుతున్నట్లు టాక్ బలంగా వినిపిస్తుంది.
ఈ ఇద్దరు కలసి చేయబోయే సినిమా మాఫియా డాన్ నేపథ్యంలో ఉండబోతుందనే టాక్ నడుస్తుంది. అంటే ఇప్పటివరకు చూడని ఓ డాన్‌గా మహేష్‌ను చూపించబోతున్నాడని టాక్. మహేష్‌తో చేయబోయే సినిమా కోసం సందీప్ ఓ టీమ్‌ను పెట్టుకొని స్క్రిప్ట్ వర్క్స్ చేస్తున్నాడని, ఆల్రెడీ బేసిక్ కథ రెడీ అయిందని సమాచారం. ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా స్టార్ట్ చేసే లోపే మహష్ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి రెడీగా పెట్టుకోవాలని అనుకుంటున్నాడట సందీప్.
త్వరలో మహేష్, సందీప్ భేటీలో జరగబోతుందని, అప్పుడు ప్రాజెక్ట్ ఓకే కాబోతుందని అంటున్నారు. అయితే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మహేష్‌తో సందీప్ రెడ్డి ఓ సినిమా స్టోరీ చెప్పినా అది వర్కౌట్ కాలేదు. ఈ సారి మాత్రం తప్పకుండా ఫిక్స్ అవుతుందని సందీప్ రెడ్డి నమ్ముతున్నాడట. ఇక మహేష్ కూడా SSMB29 తర్వాత ఏం చేయాలి అని ఇంకా ఏ సినిమా ఓకే చేయలేదు. ఆ రేంజ్‌లో ఉన్న మరో డైరెక్టర్‌తోనే సినిమా చేయాలి. ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ సినిమా, మహేష్ బాబు రాజమౌళి సినిమా అయ్యాక కలిసి పనిచేస్తారని టాక్ వైరల్ గా మారింది. ఇదే నిజమైతే మహేష్ ని వైల్డ్ మాస్ లుక్స్ లో చూడొచ్చు ఆ సినిమాలో అని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.