Site icon 10TV Telugu

Mahesh Babu : మహేష్ బాబు మేనకోడలిని చూశారా? సుధీర్ బాబు తనయులతో రాఖీ స్పెషల్ ఫోటో వైరల్..

Mahesh Babu Niece Janvi Swaroop with Sudheer Babu Sons Rakhi Special Photo shared by Manjula Ghattamaneni goes viral

Mahesh Babu : తాజాగా మహేష్ బాబు మేనకోడలు ఫోటో వైరల్ అవుతుంది. మహేష్ కి ముగ్గురు అక్కాచెల్లెళ్లు అని తెలిసిందే. మహేష్ అక్క మంజుల ఘట్టమనేనికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు జాన్వీ స్వరూప్. గతంలో జాన్వీ స్వరూప్ సందీప్ కిషన్ మనసుకు నచ్చింది సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. తాజాగా రాఖీ పూర్ణిమ సందర్భంగా చాన్నాళ్లకు జాన్వీ స్వరూప్ ఫోటో బయటకు వచ్చింది.

మంజుల ఘట్టమనేని నిన్న రాఖీ సందర్భంగా తన కూతురు జాన్వీ స్వరూప్ సుధీర్ బాబు తనయులు చరిత్ మానస్, దర్శన్ లతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి రాఖీ శుభాకాంక్షలు తెలిపింది. సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని మహేష్, మంజులకు సోదరి అవుతుందని తెలిసిందే. అలా జాన్వీ స్వరూప్ – సుధీర్ బాబు పిల్లలకు సోదరి అవుతుంది.

Also Read : War 2 Pre Release Event : నేడే ఎన్టీఆర్ – హృతిక్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడ? ఎన్ని గంటలకు? వర్షం ఎఫెక్ట్ పడుతుందా?

చాన్నాళ్లకు మహేష్ మేనకోడలు ఫోటో బయటకు రావడం, అందులోనే మహేష్ మేనల్లుళ్లు కూడా ఉండటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. మంజుల, ఆమె భర్త సంజయ్ ఇద్దరు నటీనటులే. జాన్వీ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది కాబట్టి భవిష్యత్తులో సినీ పరిశ్రమలోకి వస్తుందేమో చూడాలి. ఇక మహేష్ మేనల్లుళ్లు, సుధీర్ బాబు తనయులు చరిత్ మానస్, దర్శన్ ఇద్దరూ చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు. చరిత్ అయితే ఫ్యూచర్ లో హీరో అవుతాడని అంటున్నారు.


 

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసందే. నిన్నే మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేసి నవంబర్ లో దీనికి సంబంధించిన పెద్ద అప్డేట్ ఇస్తామని ప్రకటించారు.

Also Read : Ananya Nagalla : రాఖీ స్పెషల్.. బ్రదర్స్ తో అనన్య నాగళ్ళ ఫొటోలు..

Exit mobile version