War 2 Pre Release Event : నేడే ఎన్టీఆర్ – హృతిక్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడ? ఎన్ని గంటలకు? వర్షం ఎఫెక్ట్ పడుతుందా?
వార్ 2 సినిమా ఆగస్టు 14 న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.

War 2 Pre Release Event
War 2 Pre Release Event: ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబోలో బాలీవుడ్ లో భారీగా తెరకెక్కుతున్న స్పై సినిమా వార్ 2. యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో YRF సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా గ్రాండియర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే వార్ 2 టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు పెంచారు.
వార్ 2 సినిమా ఆగస్టు 14 న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. మొదటిసారి ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ సినిమా చేస్తుండటం. ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా కావడంతో తెలుగులో కూడా ఈ సినిమాకు భారీ హైప్ ఉంది. ఇటీవలే వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అనౌన్స్ చేసారు. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో నేడు ఆదివారం ఆగస్టు 10న సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది. ఓపెన్ గ్రౌండ్స్ లో భారీగా అభిమానుల మధ్య చేయడానికి ప్లాన్ చేశారు.
Also Read : Paradha : ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’ ట్రైలర్..
అయితే హైదరాబాద్ లో గత వారం రోజులుగా రోజూ వర్షం పడుతుంది. ముఖ్యంగా సాయంత్రం 7 నుంచి రాత్రి వరకు డైలీ వర్షం పడుతుంది. నేడు కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నట్టు వెదర్ అప్డేట్స్ చెప్తున్నాయి. దీంతో ఓపెన్ గ్రౌండ్ లో ఈవెంట్ ప్లాన్ చేశారు, వర్షం పడితే ఈవెంట్ జరుగుతుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అలాగే హృతిక్ రోషన్, కియారా అద్వానీ ఈవెంట్ కి వస్తారా లేదా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.
Also Read: Coolie Release: కూలీ క్రేజ్.. ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 14న సెలవు ప్రకటించిన కంపెనీ..