×
Ad

Varanasi : రామాయణం, ట్రెజర్ హంట్, టెక్నాలజీ, శివుడు, అంటార్కిటికా, టైం ట్రావెల్.. అన్ని మిక్స్ చేసి వారణాసి.. ఏం ప్లాన్ చేసావు రాజమౌళి..

నిన్న రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఈ అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. (Varanasi)

Image Credits : Varanasi Movie Youtube Channel

Varanasi : రాజమౌళి – మహేష్ బాబు సినిమా మీద అంచనాలు ఉండటం సహజం. కానీ నిన్న రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఈ అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ గ్లింప్స్ లో ఎన్నో లింకులు ఇస్తూ, కథని ఏటో ఏటో తీసుకెళ్తు, బోలెడన్ని లేయర్లు ఉన్నట్టు చూపించడంతో ఒక్కసారిగా సినిమాపై హైప్ వెయ్యి రేట్లు పెరిగింది.(Varanasi)

రాజమౌళి మహేష్ సినిమాకు వారణాసి అని టైటిల్ ప్రకటించారు. వారణాసి గ్లింప్స్ లో 512 వ సంవత్సరంలో వారణాసిని చూపించారు. 2027 లో భూమి మీదకు ఆస్టరాయిడ్ శాంభవి వస్తున్నట్టు చూపించారు. అంటార్కిటికా లోని ప్రపంచములోని అతి పెద్ద ఐస్ పర్వతం అయిన రాస్ షెల్ఫ్ ని చూపించారు. ఆఫ్రికాలోని అంబాసిలి అడవులను, అక్కడి జంతువులను చూపించారు. వానంతల్ ఉగ్రభతి గుహలు చూపించారు. త్రేతాయుగం లంకలో రామ రావణ యుద్ధం చూపించారు. వారణాసి మణికర్ణికా ఘాట్ చూపించారు. చివర్లో మహేష్ బాబు త్రిశూలం పట్టుకొని వారణాసిలో ఎద్దు మీద ఉగ్రంగా రుద్రుడిగా వస్తున్నట్టు చూపించారు.

Also Read : Varanasi: వారణాసి.. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్.. యావత్ దేశం గర్వపడేలా ఉంటుంది- మహేష్ బాబు

దీంతో సినిమాలో చాలా లేయర్లు ఉన్నాయని తెలుస్తుంది. రామాయణం నుంచి ప్రస్తుత కాలానికి కథ కలిపారని ఆ కథ అంతా వారణాసి చుట్టే తిరుగుతుందని తెలుస్తుంది. అలాగే ఇది ఇండియానా జోన్స్, ట్రెజర్ హంట్ లాగా ఉంటుందని గతంలో రాజమౌళి చెప్పారు. భూమండలం అంతా ఒకే చోట నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. అలా ఇండియా కూడా అంటార్కిటికా నుంచి విడిపోయింది. అంటార్కిటికా అని కూడా ఈ గ్లింప్స్ లో చూపించడం గమనార్హం. అలాగే టైం ట్రావెల్ కూడా ఉంటుందని తెలుస్తుంది. గ్లింప్స్ లో చిన్న చిన్న షాట్స్ తోనే అదరగొట్టారంటే ఇక సినిమాలో ఈ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించొచ్చు. రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. హాలీవుడ్ లెవల్లో భారీగా ప్లాన్ చేస్తున్నాడు అని తెలుస్తుంది.

మొత్తంగా రాజమౌళి హాలీవుడ్ లెవల్లో మన ఇండియన్ మూలాలు చూపిస్తూ భారీగా వారణాసి సినిమాని తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్, ప్రేక్షకులు అంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని 2027 మార్చ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also Read : Varanasi: Varanasi: రాజమౌళి, మహేష్ బాబు సినిమా టైటిల్ ఇదే.. ట్రైలర్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే..