Mahesh Babu Rajamouli SSMB 29 Movie Third Schedule Shoot Soon After Summer Gap
Mahesh – Rajamouli : మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్నSSMB29 ప్రాజెక్ట్ ఇప్పటి వరకు 2 షెడ్యూల్స్‌ని సూపర్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకుంది. హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్‌తో స్టార్ట్ అయిన ఈ సినిమా సెకండ్ షెడ్యూల్‌ని ఒడిశాలోని అడవుల్లో చేసారు. మహేశ్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలపై కీలక సీన్స్ తెరకెక్కించారు రాజమౌళి.
ఒడిశాషెడ్యూల్ తర్వాత మహేశ్-రాజమూళి సినిమా కొంతగ్యాప్ తీసుకుంది. జపాన్ లో RRR డాక్యుమెంటరీ ప్రమోషన్స్, లండన్ లో RRR స్క్రీనింగ్ కారణంగా రాజమౌళి. అటు మహేశ్ సమ్మర్ వెకేషన్స్, ఇటు ప్రియాంక చోప్రా అమెరికా వెళ్లడంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఇప్పుడు తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు డైరెక్టర్ రాజమౌళి.
SSMB29 ప్రాజెక్ట్ థర్డ్ షెడ్యూల్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు రాజమౌళి. ఈ నెల 9 నుంచి హైదరాబాద్‌లో ఈ థర్డ్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది. ఈ షెడ్యూల్‌లో కీ సీన్స్ షూట్ చేయబోతున్నారు. అయితే సినిమాలో కీలకమైన వారణాసి ఎపిసోడ్‌ని ఈ థర్డ్ షెడ్యూల్‌లోనే రాజమౌళి ప్లాన్ చేసినట్లు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇందుకోసం ఓ భారీ సెట్‌ని రెడీ చేశారని, అందులోనే మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంకలపై ఇంపార్టెంట్ సీన్స్‌ని డైరెక్ట్ చేయబోతున్నారట రాజమౌళి.
అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో అడ్వెంచరస్ మూవీగా SSMB29 ప్రాజెక్ట్ తెరకెక్కబోతుంది. RRR సినిమాతో సరికొత్త రికార్డ్స్ సెట్ చేసిన రాజమౌళి మహేశ్‌తో చేస్తోన్న వెయ్యి కోట్ల సినిమాతో పాన్ వరల్డ్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మహేశ్ ఫ్యాన్స్. మరి థర్డ్ షెడ్యూల్ నుంచైనా రాజమౌళి ఏమైన అప్‌డేట్స్ ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు మహేశ్ అభిమానులు.
Also Read : Tejaswini Vygha : పారిస్ ఈఫిల్ టవర్ వద్ద దిల్ రాజు భార్య తేజస్విని వ్యాఘ.. చీరకట్టులో ఫొటోలు..