Manchu Vishnu : ‘మా’ అసోసియేషన్ లో మంచు విష్ణు తెచ్చిన కొత్త రూల్.. నటీనటులు – నిర్మాతల మధ్య ఆ అగ్రిమెంట్ ఉండాల్సిందే..
ఓ ఇంటర్వ్యూలో విష్ణు మా అసోసియేషన్ తరపున చేస్తున్న కొత్త అగ్రిమెంట్ గురించి తెలిపారు.

Manchu Vishnu New Rule in MAA Association for Actors and Producers Agreements
Manchu Vishnu : మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)కి ప్రసిడెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో విష్ణు కన్నప్ప సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విష్ణు మా అసోసియేషన్ తరపున చేస్తున్న కొత్త అగ్రిమెంట్ గురించి తెలిపారు.
ఇటీవల హీరోలు లేకుండానే డూప్స్, బాడీ డబుల్స్, AI, కొత్త టెక్నాలజీలు వాడి సినిమాలు చేసేస్తున్నారు. ఇది తప్పేమి కాదు, హీరో ఫేస్ కరెక్ట్ గా స్క్రీన్ మీద కనిపించేంతవరకు ఇది తప్పు కాదు అని అన్నారు విష్ణు. బాడీ డబుల్స్, డూప్స్ ఉంటే షూటింగ్స్ త్వరగా అవుతాయి, ఇంకా మంచిదే అని అన్నారు.
Also Read : Tejaswini Vygha : పారిస్ ఈఫిల్ టవర్ వద్ద దిల్ రాజు భార్య తేజస్విని వ్యాఘ.. చీరకట్టులో ఫొటోలు..
అయితే విష్ణు ఈ విషయంపై మాట్లాడుతూ.. భవిష్యత్తులో టెక్నాలజీ ఇంకా పెరుగుతుంది. హీరో లేకుండా కేవలం ఆయన ఫేస్ వాడుకొని సినిమాలు చేసేయొచ్చు. గతంలో చేసిన సినిమాలు సీక్వెల్స్ ప్లాన్ చేస్తే ఆ హీరోల పర్మిషన్ లేకుండానే వాళ్ళ ఫేస్ లను కామియోగా వాడుకోవచ్చు. అలాంటి రోజులు వస్తాయి అందుకే నేను మా అసోసియేషన్ తరపున నటీనటులకు – నిర్మాతలకు మధ్య ఓ కొత్త అగ్రిమెంట్ జరిగేలా చేస్తున్నాను. తమ ప్రమేయం, పర్మిషన్ లేకుండా తమ ఫేస్ వాడటం, సీక్వెల్స్ చేయడం లాంటివి చేయకూడదు అని అగ్రిమెంట్ లో ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకూడదనే ఈ అగ్రిమెంట్స్ చేయిస్తున్నాను అని తెలిపారు.
Also Read : Lavanya Tripathi : పెంపుడు కుక్క చనిపోవడంతో.. మెగా కోడలు ఎమోషనల్ పోస్ట్..