SSMB29
SSMB29 : మహేష్ రాజమౌళి సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టు ఇప్పటికే తెలిసింది. అయితే ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో కూడా భాగం కాబోతున్నట్టు సమాచారం.
SSMB29 సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు, హీరో మాధవన్ ని తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. మాధవన్ ఇటీవల కాలంలో డిఫరెంట్ పాత్రలు చేస్తూ, ఆ పాత్రల కోసం తన బాడీని, లుక్ ని మార్చుకుంటూ సినిమాల కోసం కష్టపడుతున్నాడు. దీంతో మహేష్ తండ్రిగా కాస్త ముసలి పాత్రలో కనిపిస్తాడని, అలాగే ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందని, ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలుపెట్టారని సమాచారం.
Also Read : CM Revanth Reddy : తెలంగాణలో మరో ఫిలిం సిటీ..? సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలీవుడ్ స్టార్ హీరో..
అంతకుముందు ఈ పాత్రల కోసం నానా పాటేకర్, విక్రమ్ లను అనుకోని ఇప్పుడు మాధవన్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. రాజమౌళి ఈ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు ఇవ్వట్లేదు. ఇది కూడా రూమర్ లా వచ్చి నిజం అవుతుందేమో చూడాలి. త్వరలో ఈ సినిమా షూటింగ్ కి మూవీ యూనిట్ కెన్యా దేశానికి వెళతారని తెలుస్తుంది.
Also Read: Kingdom : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే.. ప్రోమో కూడా రిలీజ్..