Kingdom : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే.. ప్రోమో కూడా రిలీజ్..
కింగ్డమ్ కొత్త ప్రోమో మీరు కూడా చూసేయండి..

Vijay Deverakonda
Kingdom : విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కింగ్డమ్’. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ వాయిస్ తో గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేయగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే కింగ్డమ్ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. తాజాగా కింగ్డమ్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ఓ ప్రోమో రిలీజ్ చేసారు. కింగ్డమ్ సినిమాని జులై 31న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక ప్రోమోలో విజయ్ మరింత పవర్ ఫుల్ గా కనిపించాడు. ప్రోమోలో విజయ్ పోలీస్ కానిస్టేబుల్ గా, జైలు లో ఖైదీగా కూడా కనిపించడంతో ఇదేదో కొత్త స్టోరీలానే ఉంది అని తెలుస్తుంది.
Also Read : War 2 : ‘వార్ 2’ షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్.. ట్వీట్ వైరల్.. గెట్ రెడీ ఫ్యాన్స్..
కింగ్డమ్ కొత్త ప్రోమో మీరు కూడా చూసేయండి..
కొత్త విడుదల తేదీ ప్రకటిస్తూ నిర్మాతలు మాట్లాడుతూ.. కింగ్డమ్ కేవలం సినిమా కాదు. ఇది మేము ఎంతో మక్కువతో నిర్మించిన ఒక గొప్ప ప్రపంచం. ప్రతి ఫ్రేమ్ మరపురానిదిగా ఉండాలని మేము కోరుకున్నాము. జూలై 31న ఈ చిత్రం బాక్సాఫీస్ తుఫానుకు నాంది పలుకుతుంది అని అన్నారు.
Also Read : Malavika Manoj : టెన్త్ క్లాస్ కే హీరోయిన్ ఛాన్స్.. స్విమ్మింగ్ రాకపోయినా సినిమా కోసం నీళ్ళల్లో దూకేసి..