War 2 : ‘వార్ 2’ షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్.. ట్వీట్ వైరల్.. గెట్ రెడీ ఫ్యాన్స్..
తాజాగా ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ పూర్తయింది అంటూ స్పెషల్ ట్వీట్ చేసాడు.

NTR
War 2 : ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి వార్ 2 సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి ఈ సినిమాలో నటించబోతున్నాడు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ YRF నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆల్రెడీ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పారు. వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ కానుంది.
తాజాగా ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ పూర్తయింది అంటూ స్పెషల్ ట్వీట్ చేసాడు.
Also Read : Malavika Manoj : టెన్త్ క్లాస్ కే హీరోయిన్ ఛాన్స్.. స్విమ్మింగ్ రాకపోయినా సినిమా కోసం నీళ్ళల్లో దూకేసి..
ఎన్టీఆర్ తన ట్వీట్ లో.. వార్ 2 షూటింగ్ పూర్తయింది. దీన్నుంచి చాలా తీసుకున్నాను. హృతిక్ సర్ తో సెట్ లో ఉండటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. వార్ 2 జర్నీలో ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. డైరెక్టర్ అయాన్ అద్భుతం. ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఒక పెద్ద సర్ ప్రైజ్ ప్యాకేజ్ ని తయారుచేస్తున్నారు. YRF సంస్థకు, సిబ్బందికి ధన్యవాదాలు. ఆగస్టు 14 న మీరు ఈ సినిమాని చూసేదాకా వేచిఉండలేను అని తెలిపారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవ్వగా ఫ్యాన్స్ వార్ 2 సినిమాని ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.
And It’s a wrap for #War2!
So much to take back from this one…It’s always a blast being on set with @iHrithik Sir. His energy is something I have always admired. There is so much I have learned from him on this journey of War 2.
Ayan has been amazing. He has truly set the…— Jr NTR (@tarak9999) July 7, 2025
Also Read : Amardeep – Supritha : అమర్‌దీప్ – సుప్రీత సినిమా.. ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..