CM Revanth Reddy : తెలంగాణలో మరో ఫిలిం సిటీ..? సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలీవుడ్ స్టార్ హీరో..
తెలంగాణను సినీ పరిశ్రమకు ప్రపంచ హబ్ గా మారుస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.

Ajay Devgn
CM Revanth Reddy : తెలంగాణను సినీ పరిశ్రమకు ప్రపంచ హబ్ గా మారుస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అందుకు సినీ పరిశ్రమకు ఏం కావాలంటే అది అడగండి అని కూడా అన్నారు. ఇక హైదరాబాద్ ఇండియన్ సినిమాకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతుంది. తమిళ్, హిందీ సినిమాలు చాలా వరకు రామోజీ ఫిలిం సిటీలోనే షూటింగ్ జరుపుకుంటున్నాయి.
తాజాగా హైదరాబాద్ లో మరో ఫిలిం సిటీ కడతాను అంటూ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ముందుకు వచ్చాడు. నేడు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కలిశారు. తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తానని, ఏఐ సాంకేతికత జోడింపుతో వీఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియోల ఏర్పాటు చేస్తానని అలాగే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ కూడా నిర్మిస్తాననే ప్రతిపాదనలు సీఎంకి అందచేశారు.
Also Read : Kingdom : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే.. ప్రోమో కూడా రిలీజ్..
దీనిపై త్వరలోనే సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. ఇందుకు సానుకూల నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో రామోజీ ఫిలిం సిటీకి పోటీగా మరో ఫిలిం సిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read : War 2 : ‘వార్ 2’ షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్.. ట్వీట్ వైరల్.. గెట్ రెడీ ఫ్యాన్స్..