×
Ad

Varanasi : శ్రీరామనవమికి ‘వారణాసి’ నుంచి అప్డేట్ ఇదే.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ..

తాజాగా వారణాసి సినిమా నుంచి మరో అప్డేట్ రానుందని సమాచారం. (Varanasi)

Varanasi

  • మహేష్ బాబు వారణాసి సినిమా
  • శ్రీరామనవమికి అప్డేట్
  • ఫ్యాన్స్ వెయిటింగ్

Varanasi : రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వారణాసి సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. వారణాసి సినిమాకు సంబంధించి భారీ ఈవెంట్ నిర్వహించి గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు. వారణాసి గ్లింప్స్ అందర్నీ మెప్పించింది.(Varanasi)

కాశీ నుంచి మొదలుపెట్టి ఆఫ్రికా, అంటార్కిటికాతో పాటు త్రేతా యుగంకు కూడా లింక్ కలుపుతూ చాలా ఆసక్తిగా వారణాసి గ్లింప్స్ ని చూపించారు. మహేష్ బాబు నంది మీద వస్తున్న శివుడిలా చూపించారు. దీంతో ఈ గ్లింప్స్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. వచ్చే సంవత్సరం సమ్మర్ లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని సమాచారం.

Also See : Allu Arjun : ఫ్యామిలీతో జపాన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్.. ఫొటోలు షేర్ చేసిన స్నేహ రెడ్డి..

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన సాంగ్, ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ తోనే భారీ అంచనాలు ఉండగా తాజాగా వారణాసి సినిమా నుంచి మరో అప్డేట్ రానుందని సమాచారం. వారణాసి గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమాలో మహేష్ బాబు రాముడిగా కనిపిస్తాడు. మహేష్ ని రాముడి లుక్ లో చూసి నాకు గూస్ బంప్స్ వచ్చాయి అని చెప్పారు. ఇప్పుడు అదే గూస్ బంప్స్ ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకు ఇవ్వడానికి రెడీ అవుతున్నారట.

మార్చ్ 26 శ్రీరామనవమి రోజు వారణాసి సినిమా నుంచి మహేష్ బాబు రాముడి గెటప్ లో ఉన్న లుక్ రిలీజ్ చేస్తారని టాలీవుడ్ సమాచారం. దీంతో ఫ్యాన్స్ తమ ఫేవరేట్ హీరో మహేష్ ని రాముడి లుక్ లో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి రిలీజ్ చేసే లుక్ తో శ్రీరామనవమికి మహేష్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ అని తెలుస్తుంది.

Also Read : Maa Vande : వామ్మో ఏకంగా 400 కోట్ల బడ్జెట్‌తో నరేంద్ర మోదీ బయోపిక్..