Allu Arjun
Mahesh Babu : 26/11 దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మేజర్. అడివి శేష్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. మహేష్ బాబు కూడా దీనికి నిర్మాత కావడం విశేషం. ఈ సినిమా రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని మొదటి రోజే 14 కోట్ల గ్రాస్ కలెక్షన్లని వసూలు చేసి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. చూసిన వారంతా సినిమాని, టీంని అభినందిస్తున్నారు.
ఈ సినిమా చూశాక మేజర్ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది తెలుగు సినిమా కాదని, ఇండియన్ సినిమా అని. ఇలాంటి ఎపిక్ చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచన రావడమే గొప్ప. అలాంటిది సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా కోసం వెనకుండి నడిపించిన తీరు అత్యద్భుతం. ఈ సినిమాలో మేజర్ పాత్రలో అడివి శేష్ నటించలేదని, ఆయన మేజర్ సందీప్‌ను మన కళ్లకు కట్టినట్లుగా చూపించారని, సినిమా టీంని కూడా అభినందిస్తూ ట్వీట్ చేశారు బన్నీ.
Tollywood : ఇప్పటిదాకా మాస్, యాక్షన్ సినిమాలు.. ఇకపై కంటెంట్, క్లాస్ సినిమాలు..
తాజాగా బన్నీ చేసిన ట్వీట్ కి ధన్యవాదాలు తెలుపుతూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. మహేష్ ఈ ట్వీట్ లో.. ”అల్లు అర్జున్ మీకు ధన్యవాదములు. మేజర్ చిత్ర యూనిట్ కు మీ మాటలు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. మీకు సినిమా నచ్చిందని తెలిసి సంతోషంగా ఉంది” అంటూ తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్, మహేష్ బాబు చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి.
Thank you @alluarjun! Your words will surely encourage the young team of #Major. Happy to know that you loved the film ♥️ https://t.co/UVLHEQygcg
— Mahesh Babu (@urstrulyMahesh) June 5, 2022