Tollywood : ఇప్పటిదాకా మాస్, యాక్షన్ సినిమాలు.. ఇకపై కంటెంట్, క్లాస్ సినిమాలు..

పుష్ప, అఖండ, KGF, RRR ... ఇలా భారీ బడ్టెట్, స్టార్ హీరోలు, మల్టీస్టారర్, మాస్ కంటెంట్... ఈమధ్య కాలంలో ఇలాంటి కొలతలతోనే టాలీవుడ్ సినిమాలొచ్చాయి. అయితే ఇకపై స్టోరీ బేస్డ్ సినిమాలు..........

Tollywood :  ఇప్పటిదాకా మాస్, యాక్షన్ సినిమాలు.. ఇకపై కంటెంట్, క్లాస్ సినిమాలు..

Tollywood Movies

Tollywood :  పుష్ప, అఖండ, KGF, RRR … ఇలా భారీ బడ్టెట్, స్టార్ హీరోలు, మల్టీస్టారర్, మాస్ కంటెంట్… ఈమధ్య కాలంలో ఇలాంటి కొలతలతోనే టాలీవుడ్ సినిమాలొచ్చాయి. అయితే ఇకపై స్టోరీ బేస్డ్ సినిమాలు సందడి చేయనున్నాయి. కంటెంట్ నే నమ్ముకొని కొన్ని ప్రాజెక్టులు రానున్నాయి. చూడటానికి స్మాల్ రేంజ్ అనిపిస్తున్నా మ్యాటర్ తో మ్యాజిక్ చేస్తామంటున్నాయి.

మొదటి నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు నాని. ఇప్పుడు అలాగే రానున్నాడు. జూన్ 10న అంటే సుందరానికి రిలీజ్ కానుంది. ఈసారి కామెడీపై కాన్సంట్రేట్ చేసిన నాని వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన అంటే సుందరానికితో హిట్ ఖాయమంటున్నాడు. టీజర్, ట్రైలర్ చూస్తేనే ఆడియెన్స్ కు ఈజీగా కనెక్ట్ అయ్యే మూవీలా కనిపిస్తోంది. సుందర్ గా నాని, లీలగా నజ్రియా నజీమ్ చాలా ఫన్ కాస్త ఎమోషనల్ డ్రామాను చూపించబోతున్నారు.

Pooja Hegde : బుట్టబొమ్మ డేట్స్ దొరకాలంటే కష్టమే..

నాని తర్వాత స్టోరీనే హీరో అంటూ హీరోయిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ రానా రంగంలోకి దిగుతున్నాడు. వేణు ఊడుగుల తెరకెక్కించిన విరాటపర్వం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1990ల నాటి తెలంగాణ నక్సలైట్ ఉద్యమాన్ని, అప్పటి పరిస్థితులను ఈ సినిమాలో చూపించబోతున్నారు. రానాతో పాటూ సాయిపల్లవి లీడ్ క్యారెక్టర్ చేయగా నందితాదాస్, ప్రియమణి, నవీన్ చంద్ర లాంటి ఆర్టిస్టులు ఇందులో నటించారు. అయితే ట్రైలర్ రిలీజ్ ఫోటోలో సాయిపల్లవినే హైలైట్ చేసారంటూ వచ్చిన కామెంట్స్ కు తనదైన శైలిలో రిప్లై ఇచ్చిన రానా అసలు సినిమా తీసిందే సాయిపల్లవి కోసమంటూ ట్రైలర్ లాంచ్ ప్రోమోలో ట్విస్ట్ ఇచ్చాడు.

మనం, 24 లాంటి సినిమాలతో సర్ ప్రైజ్ చేసిన విక్రమ్ కె కుమార్ ఈసారి కంటెంట్ బేస్డ్ ‘థ్యాంక్యూ’ను రెడీ చేసాడు. ఇందులో నాగచైతన్యను రకరకాల వేరియేషన్స్ లో చూపించబోతున్నాడు. రాశిఖన్నా, మాళవిక, అవికా గోర్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి కథే ప్రాణమనేది మేకర్స్ వర్షన్. ఇక సమంతా చేస్తోన్న శాకుంతలం, యశోద లాంటి సినిమాలు సైతం స్టోరీ బేస్ట్ గా రానున్నవే. ఎటువంటి మాస్ మసాలాలు లేకుండా సామ్ ను ఈ సినిమాల్లో లీడ్ గా చూపించబోతున్నారు. మహాభారత గాధలోని శకుంతల కథకు మరింత గాఢత జోడించి గుణశేఖర్ చూపించబోతున్నాడు. ఇక సామ్ మరో మూవీ యశోద సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ స్టోరీతో రానుంది. ఇలా కంటెంట్, కథని నమ్ముకొని వచ్చే సినిమాలు రానున్న రోజుల్లో చాలానే ఉన్నాయి. మరి ఈ సినిమాలన్నీ ఏ రేంజ్ లో ప్రేక్షకులని అలరిస్తాయో చూడాలి.