Mahesh-Tiger Shroff: టైగర్ ష్రాఫ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న మహేష్!

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షణాది సినీ పరిశ్రమలో ఆ పేరుకో బ్రాండ్ ఉంది.

Mahesh Tiger Shroff

Mahesh-Tiger Shroff: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షణాది సినీ పరిశ్రమలో ఆ పేరుకో బ్రాండ్ ఉంది. వయసు పెరిగేకొద్దీ ఆయన బ్రాండ్ వాల్యూ కూడా అదే స్థాయిలో పెరుగుతూనే ఉంది. అందుకే ఆయనను తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకొనేందుకు ఎన్నో కార్పొరేట్ కంపెనీలు వెంటపడుతుంటాయి. ఇప్పటికే మహేష్ చాలా కంపెనీల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా ఇప్పుడు ఇదే కోవలో మరో ప్రకటన కూడా వచ్చి చేరింది.

మహేష్ ప్రకటనలలో మరే తెలుగు హీరోకు అందనంతగా కోట్లకు కోట్లు కొల్లగొడుతుండగా ఇందుకోసం ఇతర హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంటాడు. మహేష్ ఇప్పటికే బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ఓ ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే కాగా ఇప్పుడు మరో యంగ్ హీరోతో కలిసి స్క్రీన్ చేసుకుంటున్నాడు. బాలీవుడ్ యంగ్ హీరోలలో కండల వీరుడిగా పేరున్న టైగర్ ష్రాఫ్ ఇప్పుడిప్పుడే భారీ ఫాలోయింగ్ తో పాటు బాలీవుడ్ యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకుంటుండగా ఇదే సమయంలో ప్రకటనలో కూడా బిజీబిజీగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే మహేష్, టైగర్ ష్రాఫ్ కలిసి ఓ మౌత్ ఫ్రెష్నర్ బ్రాండ్ కి ప్రచారం కల్పించబోతున్నారట. ఇప్పటికే యాడ్ షూట్ కూడా పూర్తయినట్లు తెలుస్తుండగా త్వరలోనే ఈ యాడ్ టెలికాస్ట్ కానుంది. ఒకవిధంగా మహేష్, టైగర్ ష్రాఫ్ ని కలసి చూడడం ఫ్యాన్స్ కి ట్రీట్ అనే చెప్పాలి. మహేష్ ఇక్కడ యూత్ అండ్ అమ్మాయిల ఫాలోయింగ్ లో కింగ్ కాగా టైగర్ అక్కడ యాక్షన్ హీరోగా యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. మరి ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో బుల్లితెరపై చూడాలి.