Sarkaru Vaari Paata: ట్రైలర్‌లోనే క్లారిటీ ఇస్తానంటోన్న మహేష్!

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులను వరుస సినిమాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బాలకృష్ణ ‘అఖండ’ సినిమాతో మొదలుపెట్టిన ఈ దండయాత్ర తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య...

Sarkaru Vaari Paata: ట్రైలర్‌లోనే క్లారిటీ ఇస్తానంటోన్న మహేష్!

Mahesh Babu To Give Clarity In Sarkaru Vaari Paata Trailer

Updated On : April 30, 2022 / 5:02 PM IST

Sarkaru Vaari Paata: ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులను వరుస సినిమాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బాలకృష్ణ ‘అఖండ’ సినిమాతో మొదలుపెట్టిన ఈ దండయాత్ర తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య వరకు కొనసాగుతూనే ఉంది. మధ్యలో ఆర్ఆర్ఆర్, కేజీయఫ్, పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాలు వాటి సత్తా చాటడంతో ప్రేక్షకులు వరుసగా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వారి ఎంజాయ్‌మెంట్‌కు మరింత ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రెడీ అవుతున్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట.. ఒకటి కాదు రెండు సినిమాలు!

ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ‘సర్కారు వారి పాట’పై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి ఈ సినిమా పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ అండ్ సాంగ్స్. అయితే ఇవన్నీ ఓ ఎత్తయితే, సర్కారు వారి పాట చిత్ర ట్రైలర్ మరో ఎత్తు అంటున్నారు చిత్ర యూనిట్. మే 2న ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ ట్రైలర్ మహేష్ కెరీర్‌లోనే ది మోస్ట్ వింటేజ్ ట్రైలర్‌గా కట్ చేశారట చిత్ర యూనిట్. మహేష్‌ను అభిమానులు ఎలా చూడాలని అనుకుంటున్నారో, అలాగే ఈ సినిమా ట్రైలర్‌లో మనకు చూపించేస్తారట.

Sarkaru Vaari Paata: ప్రమోషన్లు షురూ.. రంగంలోకి దిగనున్న మహేష్!

ఇక ఈ ట్రైలర్‌లో మహేష్ చెప్పే డైలాగులు అభిమానులకు విపరీతంగా నచ్చుతాయని, ఆయన వింటేజ్ లుక్ అభిమానులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఏదేమైనా సర్కారు వారి పాట ట్రైలర్‌తోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నాడు మహేష్. దీంతో మహేష్ ఫ్యాన్స్ మే 2న యూట్యూబ్ రికార్డులకు ఎసరుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ అదిరిపోయే సంగీతం అందిస్తున్నాడు.