Namrata Shirodkar : బాబోయ్.. 2024లో మహేష్ ఫ్యామిలీ ఎన్ని దేశాలు తిరిగారో తెలుసా? మహేష్ భార్య పోస్ట్ వైరల్…

మహేష్ కి ఖాళీ దొరికితే చాలు ఫ్యామిలీతో ఏదో ఒక దేశానికి చెక్కేస్తాడు.

Mahesh Babu Wife Namrata Shirodkar Shares 2024 Tours Photos

Namrata Shirodkar : మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తమ ఫ్యామిలీ ఫోటోలు, టూర్స్, పిల్లల ఫోటోలు అన్ని షేర్ చేసుకుంటుంది. మహేష్ బాబు, అతని ఫ్యామిలీ రెగ్యులర్ గా విదేశాలకు ట్రిప్స్ కి వెళ్తుంటారని తెలిసిందే. మహేష్ కి ఖాళీ దొరికితే చాలు ఫ్యామిలీతో ఏదో ఒక దేశానికి చెక్కేస్తాడు. నమ్రత ఆ టూర్ ట్రిప్స్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

Also Read : Keerthy Suresh : కీర్తి సురేష్ కంటే తన భర్త ఎన్నేళ్లు పెద్దో తెలుసా? ఆల్రెడీ లివ్ ఇన్ రిలేషన్ లో ఉండి..

రీసెంట్ గానే 2024 అయిపోయి 2025 రావడంతో నమ్రత గత సంవత్సరం తాను వెకేషన్ కి వెళ్లిన సిటీల పేర్లు చెప్తూ ఆ లొకేషన్స్ లో దిగిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసి ఫ్యాన్స్, నెటిజన్లు ఒక్క సంవత్సరంలోనే ఇన్ని దేశాలకు తిరగేశారా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్ లో కేవలం నమ్రత ఒక్కటే దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇంతకీ నమ్రత ఎక్కడికెక్కడికి వెళ్లిందంటే..

ఇంగ్లాండ్ లోని లండన్, ఇటలీలోని పోర్టోఫినో, మొనాకో, మాల్దీవ్స్, అమెరికాలోని న్యూయార్క్, దుబాయ్, థాయిలాండ్ లోని బ్యాంకాక్, స్విట్జర్లాండ్ లోని జెనీవా, st మోరిట్జ్, జర్మనీలోని బాడెన్ బాడెన్, ఇండియాలోని జైపూర్, ముంబై నగరాలకు మహేష్ ఫ్యామిలీ గత సంవత్సరం వెకేషన్స్ కి వెళ్లారు. ఆల్మోస్ట్ 9 దేశాలతో పాటు ఇండియా కూడా కలుపుకొని 10 దేశాల్లో తిరిగేశారు.

Also Read : Director Shankar : తమిళ్ స్టార్ హీరో అజిత్ సినిమా వాయిదా.. గేమ్ ఛేంజర్ కోసం తెరవెనుక శంకర్ ప్లానింగ్ చేశారా?

ఇందులో కొన్ని మహేష్ తో కలిసి ఫ్యామిలీ అంతా వెళ్ళగా కొన్ని నమ్రత పిల్లలతో కలిసి వెళ్ళింది. మహేష్ రెగ్యులర్ గా ఎయిర్ పోర్ట్ లోనే కనిపిస్తాడు, ఖాళీ ఉంటే విదేశాలకు వెళ్ళిపోతాడు అని చేసే కామెంట్స్ కి ఇప్పుడు నమ్రత పెట్టిన పోస్ట్ కరెక్ట్ గా సరిపోతుంది.

ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నారు. నిన్నే ఈ సినిమా పూజ కార్యక్రమం జరిగింది. త్వరలోనే విజయవాడ దగ్గర్లో వేసిన సెట్ లో SSMB 29 షూటింగ్ జరగనుంది.