Director Shankar : తమిళ్ స్టార్ హీరో అజిత్ సినిమా వాయిదా.. గేమ్ ఛేంజర్ కోసం తెరవెనుక శంకర్ ప్లానింగ్ చేశారా?
విడాముయార్చి పోస్ట్ పోన్ వెనక పెద్ద తతంగమే నడిపించారట డైరెక్టర్ శంకర్.

Director Shankar is the Reason for Ajith Vidaamuyarchi Movie Postpone
Director Shankar : సినిమా అంటేనే కాంపిటీషన్. సంక్రాంతి రేసులో సినిమాలు రిలీజ్ కావాలంటే ఏడాది ముందు నుంచే ప్లాన్ చేస్తుంటారు. ఎంత ప్లాన్ చేసినా ఇప్పుడు గేమ్‌ఛేంజర్‌కు తమిళ్ లో స్టార్ మూవీ భయం వెంటాడింది. అదే అజిత్ సినిమా విడాముయార్చి. ఇటీవలే ఆ మూవీ రిలీజ్‌ను లైకా ప్రొడక్షన్స్ వాయిదా వేసినట్టు ప్రకటించింది. దీంతో గేమ్‌ఛేంజర్ నిర్మాతకు పెద్ద రిలీఫ్ లభించింది. అయితే విడాముయార్చి పోస్ట్ పోన్ వెనక పెద్ద తతంగమే నడిపించారట డైరెక్టర్ శంకర్.
లైకా ప్రొడక్షన్స్‌పై డైరెక్టర్ శంకర్ ఒత్తిడి తేవటంతోనే విడాముయార్చి సినిమాను సంక్రాంతి బరిలో నుంచి లాస్ట్ మినిట్‌లో తప్పించారట. డైరెక్టర్ శంకర్ లైకా ప్రొడక్షన్ కాంబినేషన్‌లో ఇండియన్-2 వచ్చింది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ప్లాప్ అయింది. అయినా కూడా లైకాతో ఇండియన్-3 సినిమా చేస్తున్నాడు శంకర్. అయితే దీనికి ముందు గేమ్‌ఛేంజర్ రిలీజ్ చేసి సక్సెస్ కొట్టాలనుకుంటున్నాడు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్‌లో కూడా గేమ్‌ఛేంజర్ రిలీజ్ చేస్తున్నారు. అజిత్ విడాముయార్చికి ఉన్న క్రేజ్ తమిళ్‌లో గేమ్‌ఛేంజర్ మూవీకి లేదు. అంతేకాదు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ కూడా విడాముయార్చినే తీసుకోవాలనుకున్నారు. దీంతో శంకర్ లైకా ప్రొడక్షన్స్ తో మాట్లాడారట.
గేమ్‌ఛేంజర్‌కు విడాముయార్చి అడ్డులేకపోతే ఇండియన్-3ని చాలా ఫాస్ట్‌గా పూర్తిచేస్తానని, గేమ్‌ఛేంజర్‌తో మళ్లీ ఫామ్‌లోకి వస్తే అది ఇండియన్ 3కి ప్లస్ అవుతుందని లైకా ప్రొడక్షన్‌ను డైరెక్టర్ శంకర్ ఒప్పించాడట. దీంతో లైకా ప్రొడక్షన్ సడెన్‌గా విడాముయార్చి రిలీజ్‌ను వాయిదా వేసుకుందన్న టాక్ తమిళ పరిశ్రమలో వినిపిస్తోంది. అయితే విడాముయార్చి మూవీ రిలీజ్ వాయిదాతో మైత్రి మూవీస్ షాక్ అయిందట. సంక్రాంతికి అజిత్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు మైత్రి మూవీస్. విడాముయార్చి రిలీజ్ ప్లాన్ లేకపోతే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని పొంగల్‌కు రిలీజ్ చేసే వాళ్లమని ఇప్పుడు ఫీల్ అవుతున్నారట మైత్రీ మూవీ మేకర్స్.
Also Read : Bollywood Vs Tollywood : నాగవంశీ దెబ్బకు టాలీవుడ్ పై ఏడుపులు.. మన సక్సెస్ ని చూసి కుళ్ళుకుంటున్న బాలీవుడ్..
మొత్తానికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కి తమిళనాడు లో ఉన్న ఒక్క పెద్ద సినిమా అడ్డు తప్పడంతో సంక్రాంతికి తమిళ్ లో కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా జనవరి 10న రిలీజ్ అవుతుండగా నిన్నే ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. రేపు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుండగా పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తున్నారు.