Pushpa 2 Song : అల్లు అర్జున్ గంగమ్మ తల్లి జాతర వీడియో సాంగ్ వచ్చేసింది.. చూశారా? పుష్ప 2కి బాగా ప్లస్ అయిన సాంగ్..
గంగమ్మ తల్లి జాతర వీడియో సాంగ్ ని తాజాగా మూవీ టీమ్ యూట్యూబ్ లో రిలీజ్ చేసారు.

Allu Arjun Pushpa 2 Gangamma Thalli Jathara Song Video Released
Pushpa 2 Song : అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 సినిమాతో వచ్చి పాన్ ఇండియా వైడ్ భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సౌత్ టు నార్త్ ప్రేక్షకులను మెప్పించి ఇంకా థియేటర్స్ లో నడుస్తుంది ఈ సినిమా. పుష్ప 2 సినిమా ఇప్పటి వరకు 1799 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ నిన్నే ప్రకటించింది. త్వరలోనే బాహుబలి 2 రికార్డ్ కూడా బీట్ చేయనుంది.
Also Read : Bollywood Vs Tollywood : నాగవంశీ దెబ్బకు టాలీవుడ్ పై ఏడుపులు.. మన సక్సెస్ ని చూసి కుళ్ళుకుంటున్న బాలీవుడ్..
పుష్ప 2 సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, సాంగ్స్ బాగా కనెక్ట్ అయ్యాయి ప్రేక్షకులకు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఆడవేషం కట్టి గంగమ్మ జాతరలో చేసిన డ్యాన్స్, పాట, ఫైట్ అన్ని విపరీతంగా నచ్చేసాయి. ఫ్యాన్స్ కి, నార్త్ వాళ్లకు అయితే ఈ గంగమ్మ జాతర ఎపిసోడ్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. గంగమ్మ జాతర ఎపిసోడ్ కోసమే సినిమాకి మళ్ళీ మళ్ళీ వెళ్ళినవాళ్ళు కూడా ఉన్నారు.
సినిమాకు అంత ప్లస్ అయిన గంగమ్మ తల్లి జాతర వీడియో సాంగ్ ని తాజాగా మూవీ టీమ్ యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. అల్లు అర్జున్ ఆడవేషం కట్టి డ్యాన్స్ చేసిన ఈ వీడియో సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ సాంగ్ ని తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. మీరు కూడా గంగమ్మ తల్లి జాతర వీడియో సాంగ్ చూసేయండి..
ఇక సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ఇప్పటికే ఓ సారి జైలుకెళ్లొచ్చారు. పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు. నేడు హైకోర్టులో అల్లు అర్జున్ బెయిల్ పై విచారణ జరగనుంది. సంధ్య థియేటర్ ఘటనలో ఎఫెక్ట్ అయిన ఆ కుటుంబానికి అల్లు అర్జున్ కోటి రూపాయలు సాయం కూడా అందించారు. మరో పక్క పుష్ప 2 సినిమా ఇంకా థియేటర్స్ లో రన్ అవుతుంది.