Sreeleela : స్టార్ హీరోతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీలీల.. బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ తో లాంచ్..
ప్రస్తుతం శ్రీలీల చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. తమిళ్ లో కూడా శివ కార్తికేయన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది.

Sreeleela Bollywood Entry with Kartik Aaryan Rumours goes Viral
Sreeleela : వరుస సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది శ్రీలీల. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నా శ్రీలీలనే తీసుకోడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హీరోలు, నిర్మాతలు. అయితే శ్రీలీల ఇటీవల తన డాక్టర్ ఎగ్జామ్స్ కోసం సినిమాలకు కొంత గ్యాప్ ఇవ్వగా ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవుతుంది. ఇటీవలే పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ తో అదరగొట్టి బాలీవుడ్ కి కూడా హింట్ ఇచ్చేసింది.
Also Read : Katha Kamamishu : నటుడిగా మారిన డైరెక్టర్.. ఆహాలో మరో కొత్త సినిమా.. కథా కమామీషు..
ప్రస్తుతం శ్రీలీల చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. తమిళ్ లో కూడా శివ కార్తికేయన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే శ్రీలీల బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందని ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఓ సినిమా కూడా సైన్ చేసిందని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ టాక్ ప్రకారం శ్రీలీల బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ తో ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
ఇటీవల వరుస హిట్స్ తో బాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు కార్తీక్ ఆర్యన్. కార్తీక్ తాజాగా ‘తు మేరీ మై తేరా.. మై తేరా తు మేరీ’ అనే సినిమాని ప్రకటించాడు. బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో సమీర్ విద్వాన్స్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.
Also Read : Pawan Kalyan : ఆ సినిమాకు వచ్చిన రెమ్యునరేషన్ తో పుస్తకాలు కొన్నా- పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమా అనౌన్స్ చేసినా హీరోయిన్ ఎవరో ప్రకటించలేదు. బాలీవుడ్ సమాచారం ప్రకారం శ్రీలీలనే ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. దీంతో బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ తో శ్రీలీల లాంచ్ అవుతుందిగా అంటూ ఆమెని తెగ పొగుడుతున్నారు. బాలీవుడ్ ఎంట్రీ కోసం శ్రీలీల ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.
View this post on Instagram