Katha Kamamishu : నటుడిగా మారిన డైరెక్టర్.. ఆహాలో మరో కొత్త సినిమా.. కథా కమామీషు..
తాజాగా మరో కొత్త సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Director Karuna Kumar Turned as Actor with Katha Kamamishu Movie Streaming in Aha
Katha Kamamishu : ఆహా ఓటీటీలో రెగ్యులర్ గా కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కొత్త సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కథా కమామీషు అనే టైటిల్ తో ఒక ఫీల్ గుడ్ సినిమా ఆహా ఓటీటీలో జనవరి 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాతో పలాస, మట్కా ఫేమ్ డైరెక్టర్ కరుణ కుమార్ పూర్తి స్థాయి నటుడిగా మారారు.
Also Read : Chiranjeevi : వాట్.. ఆ సినిమాకు చిరంజీవి నిజంగానే అని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా? కెరీర్ హైయెస్ట్..
ఇంద్రజ, కరుణ కుమార్, కృతిక రాయ్, కృష్ణ ప్రసాద్, హర్షిని, వెంకటేష్ కాకుమాను, స్తుతీ రాయ్, మొయిన్, కృష్ణ తేజ, జెమినీ సురేష్, పమ్మి సాయి, రచ్చ రవి, కాదంబరి కిరణ్, రూప లక్ష్మి.. పలువురు నటీనటులు ముఖ్య పాత్రల్లో ఈ కథా కమామీషు సినిమా తెరకెక్కింది. ఐ డ్రీమ్ మీడియా, త్రి విజిల్స్ టాకీస్ బ్యానర్స్ పై చిన్న వాసుదేవ రెడ్డి నిర్మాణంలో గౌతమ్, కార్తీక్ ఇద్దరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
నాలుగు డిఫరెంట్ కథలతో ఆంథాలజీ జానర్లో ఈ కథా కమామీషు సినిమా ఉండనుంది. ట్రైలర్ చూస్తుంటేనే సినిమా సింపుల్, స్వీట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. డైరెక్టర్ కరుణ కుమార్ పూర్తి స్థాయిలో నటుడిగా మారి ఇంద్రజతో జంటగా నటించడంతో టాలీవుడ్ లో ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. మీరు కూడా ఈ సినిమాని ఆహా ఓటీటీలో చూసేయండి..
Also Read : Pawan Kalyan : ఆ సినిమాకు వచ్చిన రెమ్యునరేషన్ తో పుస్తకాలు కొన్నా- పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు