Chiranjeevi : వాట్.. ఆ సినిమాకు చిరంజీవి నిజంగానే అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా? కెరీర్ హైయెస్ట్..

మెగాస్టార్ గా దాదాపు 40 ఏళ్లనుంచి టాలీవుడ్ లో టాప్ స్టార్ గా కంటిన్యూ అవుతున్నారు.

Chiranjeevi : వాట్.. ఆ సినిమాకు చిరంజీవి నిజంగానే అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా? కెరీర్ హైయెస్ట్..

Megastar Chiranjeeevi Remuneration for Srikanth Odela Movie Goes Viral

Updated On : January 3, 2025 / 7:57 AM IST

Chiranjeevi : నిన్న కాక మొన్నొచ్చిన హీరోలు కూడా 20, 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి సీనియర్ స్టార్ సాక్షాత్తూ మెగాస్టార్ ఇంకెంత తీసుకోవాలి..? మెగాస్టార్ చిరంజీవి మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది. అయితే ఆయన సినిమాల గురించి కాదు సినిమా చెయ్యడానికి ఆయన తీసుకునే రెమ్యునరేషన్ గురించి.

మెగాస్టార్ గా దాదాపు 40 ఏళ్లనుంచి టాలీవుడ్ లో టాప్ స్టార్ గా కంటిన్యూ అవుతున్నారు. కానీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఎప్పుడూ న్యూస్ లోకి రాలేదు. అయితే ఈసారి మాత్రం నాని, SLV ప్రొడక్షన్లో శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో చేయబోతున్న వైలెంట్ సినిమాకి మాత్రం హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Also Read : Pawan Kalyan : ఆ సినిమాకు వచ్చిన రెమ్యునరేషన్ తో పుస్తకాలు కొన్నా- పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాలీవుడ్ టాక్. కానీ ఆ తర్వాత సక్సెస్ మారింది. రెమ్యూనరేషన్ రేంజ్ మారింది. అందుకే విశ్వంభర కి మరో 5 కోట్లు పెంచారట. కానీ ఇప్పుడు పాతరేట్ వర్కవుట్ కాదంటున్నారట చిరంజీవి. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మెగాస్టార్ ఈమధ్య కాలంలో టచ్ చెయ్యని డిఫరెంట్ సబ్జెక్ట్ తో తెరకెక్కబోతున్న శ్రీకాంత్ ఓదెల సినిమాకి ఏకంగా 75 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు టాలీవుడ్ లో వినిపిస్తుంది.

టాలీవుడ్ లో మొదటి సారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న హీరో చిరంజీవి అని అందరికి తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ కెరీర్ లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ 75 కోట్లు శ్రీకాంత్ ఓదెల సినిమాకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరోగా 75కోట్లు తీసుకుంటున్నారని తెలిసి ఫ్యాన్స్ కూడా సర్ ప్రైజ్ అవుతున్నారు.

Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్.. ఎప్పుడు? ఎక్కడ?.. బాబాయ్ కోసం అబ్బాయి.. స్పెషల్ పోస్టర్ రిలీజ్..

నిజంగానే చిరంజీవి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా అని ఆశ్చర్యపోతున్నారు. మరి చిరంజీవి ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ పెంచేశారంటే శ్రీకాంత్ ఓదెల సినిమా ఏరేంజ్ లో ఉండబోతోందో అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ త్వరలోనే శ్రీకాంత్ ఓదెల మూవీ కోసం మేకోవర్ కాబోతున్నారు.