Keerthy Suresh : కీర్తి సురేష్ కంటే తన భర్త ఎన్నేళ్లు పెద్దో తెలుసా? ఆల్రెడీ లివ్ ఇన్ రిలేషన్ లో ఉండి..

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ..

Keerthy Suresh : కీర్తి సురేష్ కంటే తన భర్త ఎన్నేళ్లు పెద్దో తెలుసా? ఆల్రెడీ లివ్ ఇన్ రిలేషన్ లో ఉండి..

Keerthy Suresh spoke about age gap between her Husband and says about their Live in Relation

Updated On : January 3, 2025 / 10:43 AM IST

Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ ఓ పక్కన సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా ఇటీవలే డిసెంబర్ 12న తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ ని పెళ్లి చేసుకుంది. ఆల్మోస్ట్ 15 ఏళ్ళ ప్రేమ ని ఇన్నాళ్లు దాచి ఇప్పుడు పెళ్లి తర్వాత తమ ప్రేమ గురించి ఒక్కో విషయం చెప్తుంది. ఇటీవలే బాలీవుడ్ లో బేబీ జాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. అయితే ఈ సినిమా ఫలితం కీర్తిని నిరాశపరిచింది.

Also Read : Director Shankar : తమిళ్ స్టార్ హీరో అజిత్ సినిమా వాయిదా.. గేమ్ ఛేంజర్ కోసం తెరవెనుక శంకర్ ప్లానింగ్ చేశారా?

బేబీ జాన్ సినిమా సమయంలో కీర్తి వరుసగా బాలీవుడ్ లో ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ఆంటోనీని నేను 12వ తరగతి చదువుతున్నప్పుడు కలిసాను. అతను నాకంటే ఏడేళ్లు పెద్ద. అతను ఖతార్ లో వర్క్ చేసేవాడు. మేము ఆరేళ్ళు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ లో ఉన్నాము. కరోనా సమయంలో మేము లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాం. మేమిద్దరం కరోనా సమయంలో కలిసి ఒకే ఇంట్లో ఉన్నాము అని తెలిపింది.

అంటోన్ తట్టిల్ ఓ వ్యాపారవేత్త. అతనికి తమిళనాడుతో పాటు అరబ్ కంట్రీస్ లో వ్యాపారాలు ఉన్నాయి. 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరు లివ్ ఇన్ రిలేషన్ లో ఉండి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. హిందూ, క్రిస్టియన్ రెండు సాంప్రదాయాల్లోను వీరు గోవాలో పెళ్లి చేసుకున్నారు. తాజాగా కీర్తి తన భర్త తనకంటే ఏడేళ్లు పెద్ద అని చెప్పడంతో ఆశ్చర్యపోతున్నారు. ఇంటర్ చదివేటప్పటి నుంచే అతనితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వెళ్ళింది అంటే గ్రేట్ అనే అంటున్నారు.

Also Read : Pushpa 2 Song : అల్లు అర్జున్ గంగమ్మ తల్లి జాతర వీడియో సాంగ్ వచ్చేసింది.. చూశారా? పుష్ప 2కి బాగా ప్లస్ అయిన సాంగ్..

ప్రస్తుతం కీర్తి చేతిలో రెండు తమిళ్ సినిమాలు ఉన్నాయి. ఇవి పెళ్ళికి ముందు ఒప్పుకున్నవే. మరి పెళ్లి తర్వాత సినిమాలు రెగ్యులర్ గా చేస్తుందా లేదా చూడాలి.