Mahesh Babu's nephew Ashok Galla cancels his shoot for OG movie
OG Movie: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓజీ ఫీవర్ నడుస్తోంది. అమెరికా, అనకాపల్లీ అనే తేడా లేకుండా (OG Movie)థియేటర్స్ లో రచ్చ రచ్చ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆయన హీరోగా వచ్చిన ఓజీ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇక సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్స్ ఈ సినిమా చూసేందుకు థియేటర్స్ బాట పట్టారు. ఇందులో భాగంగానే మరో సూపర్ స్టార్ మేనల్లుడు ఏకంగా తన సినిమా షూటింగ్ నే క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ హీరో మరెవడో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గళ్ళ అశోక్.
OG: పాపం బ్యాడ్ లక్.. ఓజీ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఈ హీరో ప్రస్తుతం వింటారా సరదాగా అనే సినిమా చేస్తున్నారు. ఈ షూటింగ్ లో భాగంగానే ఒక వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు గల్లా అశోక్. ” ఈ వీడియోలో ఓజీ సినిమా రిలీజ్ రోజు కూడా డైరెక్టర్ షూటింగ్ ఉంది అంటాడు. కానీ, చిత్ర యూనిట్ మాత్రం ఓజీ సినిమా ప్రీమియర్స్ కి వెళ్లాలని, షూటింగ్ క్యాన్సిల్ చేయించడానికి నానా కష్టాలు పడతారు. అలా హీరో, కమెడియన్ చాలామంది డైరెక్టర్ ను కన్విన్స్ చేయాలనీ ట్రై చేస్తారు. కానీ, చివరకు షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందా అనేది మాత్రం వీడియోలో చూపించలేదు. ఈ వీడియోకి మా డైరెక్టర్ ను కన్విన్స్ చేసే సలహాలా ఎవరైనా ఇవ్వండి అంటూ కోరాడు హీరో అశోక్ గల్లా. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అయ్యుండి ఎలాని ఈగో లేకుండా మరో స్టార్ హీరో కోసం తన షూటింగ్ క్యాన్సిల్ చేయడం మాములు విషయం కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.