Mahisha : ‘మహిష’ టీజర్ చూశారా..? త్వరలోనే సినిమా రిలీజ్ అంటూ..
ఇటీవల మహిష టీజర్ రిలీజ్ చేయగా తాజాగా దానికి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మూవీ యూనిట్.

Mahisha Movie Teaser Released Press Meet Happened
Mahisha : ప్రవీణ్ KV, యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి, మౌనిక ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘మహిష’. స్క్రీన్ ప్లే పిక్చర్స్ బ్యానర్ పై ప్రవీణ్ KV హీరోగా, దర్శకుడిగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మహిష సినిమా సెన్సార్ పూర్తిచేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. ఇటీవల మహిష టీజర్ రిలీజ్ చేయగా తాజాగా దానికి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మూవీ యూనిట్.
Also Read : Vettaiyan Trailer : ‘వేట్టయన్’ ట్రైలర్ వచ్చేసింది..
ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్, హీరో ప్రవీణ్ KV మాట్లాడుతూ.. మహిష సినిమాను మా టీమ్ అంతా కష్టపడి చేసాము. సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారు. ఇటీవల రిలీజ్ చేసిన మా సినిమా టీజర్ కు దాదాపు రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. ఇవి పెద్ద నంబర్ కాకపోవచ్చు కాని జెన్యూన్ వ్యూస్. మహిష సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మెసేజ్ కూడా ఉంది. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ అని తెలిపారు. మీరు కూడా మహిష టీజర్ చూసేయండి..
ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ మాట్లాడుతూ.. మహిష సినిమాని వివిధ జానర్స్ కలిపి ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు ప్రవీణ్. ప్రస్తుతం మహిళల మీద జరుగుతున్న ఘటనలతో పాటు ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. మహిష సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాను. పాటలకు రెస్పాన్స్ బాగుంది అని తెలిపారు.