కోల్‌కతా ‘మైదాన్’లో అజయ్ దేవ్‌గణ్ మ్యాచ్

అజయ్‌ దేవగన్‌, కీర్తీ సురేష్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘మైదాన్’ తర్వాతి షెడ్యూల్ కోల్‌కతాలో నవంబరు 3నుంచి ప్రారంభం కానుంది..

  • Published By: sekhar ,Published On : October 14, 2019 / 07:12 AM IST
కోల్‌కతా ‘మైదాన్’లో అజయ్ దేవ్‌గణ్ మ్యాచ్

Updated On : October 14, 2019 / 7:12 AM IST

అజయ్‌ దేవగన్‌, కీర్తీ సురేష్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘మైదాన్’ తర్వాతి షెడ్యూల్ కోల్‌కతాలో నవంబరు 3నుంచి ప్రారంభం కానుంది..

ఇండియన్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌ కమ్‌ మేనేజర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ‘మైదాన్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది. అబ్దుల్‌ రహీమ్‌ పాత్రలో అజయ్‌ దేవగన్‌ కనిపించనుండగా.. కీర్తీ సురేష్‌ కథానాయికగా నటిస్తుంది.

జీ స్టూడియోస్‌తో కలిసి బోనీ కపూర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘బదాయి హో’ ఫేమ్‌ అమిత్‌ రవీంద్రనాధ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా ముంబై షెడ్యూల్‌ కంప్లీట్ అయింది. అజయ్‌ దేవగన్, కీర్తీ సురేష్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

Read Also : చావునైనా ఎదిరించి చావాలి : ఖైదీ ట్రైలర్..

తర్వాతి షెడ్యూల్‌ కోల్‌కతాలో నవంబరు 3నుంచి ప్రారంభం కానుందని యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ముంబై మైదానంలో మ్యాచ్‌ ముగించిన అజయ్‌.. కోల్‌కతాలో జరగనున్న తర్వాతి మ్యాచ్‌ కోసం రెడీ అవుతున్నారు. ‘మైదాన్’ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు.