మజిలీ నుండి ‘మాయ మాయ‌’ సాంగ్ రిలీజ్

  • Published By: veegamteam ,Published On : March 26, 2019 / 06:14 AM IST
మజిలీ నుండి ‘మాయ మాయ‌’ సాంగ్ రిలీజ్

Updated On : March 26, 2019 / 6:14 AM IST

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత, దివ్యాంక కౌశిక్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శివ నిర్వాణ తెర‌కెక్కించిన చిత్రం మ‌జిలి. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి ప‌లు సాంగ్స్ విడుద‌ల చేసిన టీం తాజాగా ‘మాయ మాయ‌’ సాంగ్‌కి సంబంధించి వీడియో టీజ‌ర్ రిలీజ్ చేసింది. నాగ చైతన్యను ఇంట్రడ్యూస్ చేస్తూ సాంగ్ అది. పెళ్లి తర్వాత అక్కినేని నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న తొలి చిత్రం మజిలి.

వచ్చే నెల (ఏప్రిల్ 5, 2019)న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.. ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. భాస్క‌ర బ‌ట్ల ఈ సాంగ్‌కి లిరిక్స్ అందించ‌గా, అనురాగ్ కుల‌క‌ర్ణి ఆల‌పించారు. గోపి సుంద‌ర్ సంగీత సార‌ధ్యం వ‌హించారు. ఈ సాంగ్‌ యువతను ఆకట్టుకునేలా చిత్రీకరించారు.