Pranshu : ఇన్‌స్టా రీల్స్‌లో బ్యాడ్ కామెంట్స్ భరించలేక మేకప్ ఆర్టిస్ట్ ఆత్మహత్య

సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్లు భరించలేక కొందరు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మేకప్ ఆర్టిస్ట్ బ్యాడ్ కామెంట్లకు బలైనట్లు తెలుస్తోంది.

Pranshu

Pranshu : సోషల్ మీడియాలో భిన్న మనస్తత్వాలు ఉన్న మనుష్యులు కనిపిస్తుంటారు. కొందరిని కావాలని టార్గెట్ చేసి ద్వేషపూరితమైన కామెంట్లు పెడుతుంటారు. అది తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయే వారు కొందరైతే.. ప్రాణాలు తీసుకున్న వారు కూడా ఉన్నారు. తాజాగా ఇన్ స్టా రీల్స్‌లో కామెంట్స్ తట్టుకోలేక  ఓ మేకప్ ఆర్టిస్ట్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Tollywood : టాలీవుడ్‌లో సెట్ అవుతున్న కొత్త కాంబినేషన్స్.. చిరు, రవితేజ, డీజే టిల్లు..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినికి చెందిన 16 సంవత్సరాల ట్రాన్స్ జెండర్ ప్రన్షు మేకప్ ఆర్టిస్టుగా ఉన్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో యాక్టివ్‌గా ఉంటూ రకరకాల మేకప్ వీడియోలను షేర్ చేస్తుంటాడు. ఈ మధ్య ప్రన్షు షేర్ చేసిన వీడియో అతని బలవన్మరణానికి కారణమైంది. దీపావళి పండుగ సమయంలో ప్రన్షు చీరకు సంబంధించిన వీడియోను షేర్ చేయడంతో నెటిజన్లు అతనిపై నెగెటివ్ కామెంట్స్ స్టార్ట్ చేసారు. 4,000 లకు పైగానే బ్యాడ్ కామెంట్లు రావడంతో తట్టుకోలేక తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన ప్రన్షు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నిట్రాన్స్ జెండర్.. మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ యాక్టర్, మరియు డాక్టర్ అయిన  త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు తెలిపారు.

Kantara 2 : కాంతార 2 బిగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ డేట్ అనౌన్స్..

trintrin అనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నటుడు త్రినేత్ర .. ప్రన్షు మరణంపై  ఆవేదన పూరితమైన పోస్టు పెట్టారు. తనకు మేకప్ లో ఎన్నో మెళకువలు నేర్పానని,  ట్రాన్స్ జెండర్స్‌కి సోషల్ మీడియాలో రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. సైబర్ బెదిరింపులను పరిష్కరించడంలో సోషల్ మీడియాలోని కొన్ని యాప్‌లు ఫెయిల్ అయ్యాయని ఆమె చెప్పుకొచ్చారు. ఇక ప్రన్షు ఆత్మహత్య విషయంలో దర్యాప్తు జరుగుతోందని..అతని ఆత్మహత్య వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించలేదని నాజ్ గిరి పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జి కెఎస్ గెహ్లాట్ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు